»   » దాసరి ని పరామర్శించిన సినీ రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)

దాసరి ని పరామర్శించిన సినీ రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే.. ఈ విషయం తెలిసిన వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కట్టారు. కాగా దాసరి ఆనారోగ్యానికి గురైన సంగతి తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆందోళనకు గురయ్యినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళిన చిరంజీవికి ఈ విషయం తెలిసిన వెంటనే తిరుగు పయణమయ్యారు.

ఇప్పటికే అల్లు అరవింద్ దాసరి గారిని కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించి దాసరి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆసుపత్రి పాలైన వార్త సినీ పరిశ్రమని దిగ్భాంతికి గురిచేసింది. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న దాసరికి సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేశారు. నిన్న మద్యాహ్నం దాసరి హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు కిమ్స్ వైద్యులు.

 తీవ్ర అస్వస్థత:

తీవ్ర అస్వస్థత:


దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి సంగతి తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది. జయసుధ, మోహన్‌బాబు, అల్లు అరవింద్‌ పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిలో ఆయన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

 పలువురు సినీ ప్రముఖులు:

పలువురు సినీ ప్రముఖులు:


దాదాపు 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు డైరెక్టర్‌ ఆయన. ఆయన అనారోగ్య పరిస్థితిని తెలుసుకుని టాలీవుడ్‌లోని పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు.

 ఛాతీకి కీ హోల్ సర్జరీ:

ఛాతీకి కీ హోల్ సర్జరీ:


‘దాసరికి ఛాతీకి కీ హోల్ సర్జరీ చేశాం.. ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగించాం.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచాం.. రెండు మూడు రోజుల్లో ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని' తెలిపారు. దాసరి కిమ్స్ లో చేరాడు అని తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్య విషయం పై ఆరా తీశారు .

 మోహన్ బాబు కుటుంబం:

మోహన్ బాబు కుటుంబం:


ఇక మంచు మోహన్ బాబు కుటుంబం దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు . అగ్ర నిర్మాత అల్లు అరవింద్ దాసరిని పరామర్శించి దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని మీడియా కి చెప్పాడు . ఇక దాసరి హాస్పిటల్లో ఉన్నారన్న విషయం తెలియగానే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కింస్ ఆసుపత్రి బాట పట్టారు.

 వెంటిలేటర్ పై:

వెంటిలేటర్ పై:


అయితే మంగళవారం మధ్యాహ్నం కిమ్స్ హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్ లో దాసరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉందని వైద్యులు తెలిపారు.

 మీడియాలో బ్రేకింగ్ న్యూస్ :

మీడియాలో బ్రేకింగ్ న్యూస్ :


మధ్యాహ్నం వేళ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్‌ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందారు.

 కొత్త సినిమా తీస్తానని:

కొత్త సినిమా తీస్తానని:


జయలలిత జీవిత కథ ఆధారంగా కొత్త సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం,కాపు ఉద్యమానికి అండగా సమావేశాలు జరపడంతో దాసరి ఈజ్ బ్యాక్ అని అభిమానులు కూడా సంతోషపడ్డారు.ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు తో ఆయన సంబంధాలు మెరుగుపడ్డట్టేనని భావిస్తున్న సమయంలో

 పూర్థి స్తాయిలో కోలుకుంటారనీ:

పూర్థి స్తాయిలో కోలుకుంటారనీ:


ఈ అనారోగ్య విషయం బయటికి వచ్చింది. అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చేసిన ప్రకటనని బట్టి దాసరి ఆరోగ్యం నిలకడ గానే ఉందని తెలుస్తోంది. దాసరి ఆరోగ్యం మెరుగ్గనే ఉందని. దాదాపు రేపటికల్లా ఆయన పూర్థి స్తాయిలో కోలుకుంటారనీ అల్లు చెప్పటం తో టాలీవుడ్ లో కాస్త ప్రశాంతత నెలకొంది.

English summary
One of the topmost Tollywood Director Dasari Narayana Rao is admitted in KIMS hospital, Cine Celebrities Visit Dasari Narayana Rao
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu