twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు చిత్రసీమలో విషాదం: సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు మృతి

    |

    తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం మరణించారు. ఎన్నో సినిమాలకు పీఆర్ఓగా సేవలందించిన అనుభవం పసుపులేటి రామారావు సొంతం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలియజేస్తున్నారు.

    సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు.

    Cine Pro, Senior Journalist Pasupuleti Rama Rao passed away

    ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసారు. ఆ తరువాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా జర్నలిస్ట్‌గా పనిచేసారు. ప్రస్తుతం 'సంతోషం' సినీ పత్రికకు జర్నలిస్ట్‌‌గా పనిచేస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు.

    డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్ గా పనిచేసారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా నేటి యంగ్ హీరోలను సైతం ఇంటర్వ్యూలు చేసిన అనుభవం పసుపులేటి రామారావుకు ఉంది.

    English summary
    Cine Pro, senior journalist Pasupuleti RamaRao paased away this morning. Cine celebrities putting their condolences to his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X