»   » రోడ్డు ప్రమాదంలో సినిమా యూనిట్ సభ్యుల మృతి

రోడ్డు ప్రమాదంలో సినిమా యూనిట్ సభ్యుల మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్ తో సహ ఇద్దరు దుర్మరణం చెంది ఇద్దరికి గాయాలు అయిన సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. గత 15 రోజుల నుండి ‘శిరాడిఘాట్' అనే కన్నడ సినిమా షూటింగ్ మలేనాడు పరిసర ప్రాంతాలలో నిరవదికంగా జరుగుతున్నది. బెంగళూరులో నివాసం ఉంటున్న చిరంజీవి (32) అనే యువకుడు ఈ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.

 Cine unit members dead in a road accident

సోమవార రాత్రి సినిమా షూటింగ్ ముగించారు. తరువాత వారి వారి వాహనాలలో మలెనాడు నుండి బెంగళూరు బయలుదేరారు. చిరంజీవి, సినిమా యూనిట్ సభ్యులు రాజేష్, సతీష్ క్వాలిస్ వాహనంలో బెంగళూరు బయలుదేరారు. క్వాలిస్ వాహనాన్ని డ్రైవర్ మహంతేష్ (35) నడుపుతున్నాడు. మార్గం మద్యలో మంగళవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో హాసన్ తాలుకా శాంతి గ్రామం దగ్గర ఎదురు నుండి వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం క్వాలిస్ వాహనాన్ని డీకొనింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన అసిస్టెంట్ కెమెరా మ్యాన్ చిరంజీవి, క్వాలిస్ డ్రైవర్ మహంతేష్ దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన రాజేష్, సతీష్ లను బెంగళూరులోని నిమ్హన్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు ఉందని శాంతిగ్రామ పోలీసులు తెలిపారు.

English summary
Kannada film unit members Chiranjeevi and Mahatesh dead in a road accident.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu