»   » తాగుడు ఎఫెక్ట్: బివిఎస్ రవి లైసెన్స్ రద్దు

తాగుడు ఎఫెక్ట్: బివిఎస్ రవి లైసెన్స్ రద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ రచయిత బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి గతంలో రెండు సార్లు మద్యం తాగి డ్రివింగ్ చేస్తూ పట్టుబడిన సంగతి తెలసిందే. తొలి సారి ఆయన మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో ప్రముఖ హీరో రవితేజ కూడా అదే కారులో ఉన్నారు.

Cine writer BVS Ravi lose his driving license

తొలిసారి దొరికినపుడే పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. అయినా మరో సారి అతను మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. రెండో సారి పట్టుబడ్డపుడు అతని వెంట ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఈ రెండు సార్లు పోలీసులు అతనికి భారీగా జరిమాన విధించడంతో పాటు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయినట్లు ట్రాపిక్ అదనపు పోలీస్ కమీషనర్ జితేందర్ తెలిపారు. బివిఎస్ రవితో పాటు ఇలానే రెండు సార్లు పట్టుబడిన పలువురు పేర్లను కూడా ఆయన వెల్లడించారు.

English summary
Cine writer BVS Ravi lose his driving license due to Drunk Driving case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu