»   » ఆగస్టు 2న ‘సినిమాకెళ్దాం రండి’

ఆగస్టు 2న ‘సినిమాకెళ్దాం రండి’

Posted By:
Subscribe to Filmibeat Telugu
రాజేంద్రప్రసాద్, మాస్టర్ భరత్ ప్రధానపాత్రధారులుగా శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం 'సినిమాకెళ్దాం రండి'. ఎం.ఎం.జి.రెడ్డి దర్శకత్వంలో సునీతా ప్రభాకర్, సీత నెక్కంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది.

చిత్ర దర్శకుడు ఎం.ఎం.జి.రెడ్డి మాట్లాడుతూ పూర్తి హాస్యరసంతో నిర్మించిన 'సినిమాకెళ్దాం రండి'లో అసలు సినిమాకెందుకు వెళ్లాలి అనే అంశాన్ని ప్రత్యేక చర్చ చేశామని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, రాజేంద్రప్రసాద్ మారువేషాలతో చేసే అనేక సన్నివేశాలలో హాస్యం ప్రేక్షకులకు నచ్చుతుందని, రాజేంద్ర ప్రసాద్, మాస్టర్ భరత్ అన్నదమ్ములుగా చేశారు. ఓ ఏపిసోడ్ లో వీరిద్దరు చేసే అల్లరి సన్నివేశాలు చాలా గమ్మత్తుగా, థ్రిల్లింగా ఉంటాయని సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైందని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ..పూర్తి స్థాయి వాణిజ్య విలువలతో కూడి ప్రేక్షకులను ఆశ్చర్యానందానుభూతులకు గురి చేసే కథాంశం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నవరస సమ్మేళనం...టైటిల్ ను బట్టి దీన్నొక సినిమా నేపథ్య చిత్రంగా భావిస్తున్నారు. ఇది వేరే తరహా సినిమా అని తెలిపారు.

రవిబాబు, రాజీవ్‌కనకాల, నాగినీడు, రచనావౌర్య, ఎమ్మెస్ నారాయణ, ఆషాశైని, శ్రీమాన్, లీనాసిద్ధు, మురళీకృష్ణ, వర్షిణి, వల్లభనేని జనార్ధన్, తాగుబోతు రమేష్, ప్రియాంక, సానియా, శ్రీవాత్సవ్, కీర్త తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, రచన, దుర్గాప్రసాద్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: రామాంజి, నిర్మాతలు: సునీతా ప్రభాకర్, సీత నెక్కంటి, దర్శకత్వం: ఎం.ఎం.జి.రెడ్డి.

English summary
Rajendra Prasad starrer 'Cinemakeldam Randi' to release on Aug 2. The movie is directed by MMG Reddy, is produced by Seeta Nekkenti, P Suneeta and music by Shravan.
Please Wait while comments are loading...