twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ ఇక లేరు

    By Srikanya
    |

    చెన్నై : ప్రముఖ సినిమాటోగ్రాఫర్, అభినందన,నీరాజనం వంటి అభిరుచి గల చిత్రాల దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మృతి చెందారు. ఆయన గత ఆరు నెలలుగా గుండెకు సంభందించిన ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్నారు. చెన్నై,హైదరాబాద్ లలోని హాస్పటిల్స్ లో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్యం మరీ విషమించటంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకు వచ్చారు. పలు భారతీయ భాషల్లో ఆయన దాదాపు వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసారు. జీన్స్ వంటి చిత్రాలకు సైతం ఆయన చేతిలో రూపుదిద్దుకున్నవే.

    పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు ఫోటోగ్రఫిని అశోక్ కుమార్ అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్ కు జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

    Cinematographer Ashok Kumar passes away

    అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.

    అశోక్ కుమార్ తెలుగు తమిళ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.

    English summary
    Ace southern cinematographer Ashok Kumar Agarwal, who was battling for life here for over the last six months with "health-related issues", passed away Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X