»   » క్రేజీ ప్రాజెక్ట్‌గా ప్రిన్స్ మహేష్ #25.. బాలీవుడ్‌ నుంచి దించేశారు..

క్రేజీ ప్రాజెక్ట్‌గా ప్రిన్స్ మహేష్ #25.. బాలీవుడ్‌ నుంచి దించేశారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 మహేష్‌బాబు 25వ చిత్రం

మహేష్‌బాబు 25వ చిత్రం

ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లో ఇది ఆయనకు 25వ చిత్రం. ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక నిపుణులతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ ఎంపిక చేశారు.

బాలీవుడ్‌లో మోహనన్ చిత్రాలు

బాలీవుడ్‌లో మోహనన్ చిత్రాలు

బాలీవుడ్‌లో 2006లో వచ్చిన డాన్‌ చిత్రానికి, తలాష్‌, రయీస్‌ లాంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని కె.యు.మోహనన్‌ అందించారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయనున్నారు.

 మహేష్ సరసన పూజాహెగ్డే

మహేష్ సరసన పూజాహెగ్డే

ఈ చిత్రంలో మహేష్‌‌బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పూజాకు భారీ రెమ్యునరేషన్‌ను ముట్టుజెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సినిమాకు కూడా పూజా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

 సాంకేతిక నిపుణులు..

సాంకేతిక నిపుణులు..

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

English summary
Mahesh Babu’s untitled Telugu film, to be directed by Vamshi Paidipally. The project, Mahesh’s 25th film, will mark his first time collaboration with director Vamshi. The film is being jointly bankrolled by Dil Raju and Aswini Dutt. Cinematographer KU Mohanan roped for this prestigious project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu