»   » ‘1000 కోట్లు తొలి హీరో ప్రభాస్... రాజమౌళి ఆఫ్ హాలీవుడ్’ సెంథిల్ కిరాక్ స్పీచ్

‘1000 కోట్లు తొలి హీరో ప్రభాస్... రాజమౌళి ఆఫ్ హాలీవుడ్’ సెంథిల్ కిరాక్ స్పీచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆదివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన బాహుబలి 2 ప్రీరిలీజ్ పంక్షన్లో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన సెంథిల్ కుమార్.... ప్రభాస్ అభిమానులను, రాజమౌళి ఫ్యాన్స్ ను మెప్పించేలా కిరాక్ స్పీచ్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

తెలుగు సినిమాలపై చిన్న చూపు

తెలుగు సినిమాలపై చిన్న చూపు

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకునేప్పుడు మాకు చాలా సినిమాలు చూపించే వారు. తమిళ సినిమా, బెంగాళీ సినిమా, పంజాబీ, మరాఠీ ఏవేవో సినిమాలు చూపించే వారు. తెలుగు సినిమాల గురించి మాట్లాడటం కానీ, మాట్లాడుకోవడం కానీ ఉండేది కాదు. ఈ రోజు దేశం మొత్తం, ప్రపంచంలోని సినీ ప్రేమికులంతా మన తెలుగు బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారు అని సెంథిల్ తెలిపారు.

గర్వంగా ఉంది

గర్వంగా ఉంది

ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ఈ సందర్బంగా థాంక్స్ చెబుతున్నాను అని సెంథిల్ కుమార్ అన్నారు.

జేమ్స్ కామెరూన్ ను హాలీవుడ్ ఆఫ్ రాజమౌళి

జేమ్స్ కామెరూన్ ను హాలీవుడ్ ఆఫ్ రాజమౌళి

రాజమౌళి ఇలానే వెళతా ఉంటే రేపు రాజమౌళిని జేమ్స్ కామెరూన్ ఆఫ్ టాలీవుడ్ కాదు, జేమ్స్ కామెరూన్ ను రాజమౌళి ఆఫ్ హాలీవుడ్ అంటారు. ఆయన ప్రొగ్రెస్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అలాంటి వ్యక్తితో పని చేసినందుకు గర్వంగా ఉంది అని సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చారు.

జీవితం మారిపోయింది

జీవితం మారిపోయింది

బాహుబలి సినిమా గురించి మాట్లాడాలంటే... ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ జీవితం మారిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత మరో అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న టైంలో ఒక సినిమా ఐదేళ్లు తీసి అందరి జీవితాలు మెరుగుపరిచారు. ఈ సందర్భంగా నిర్మాతలు శోభుగారిరి, ప్రసాద్ గారికి థాంక్స్ చెబుతున్నాను అని సెంథిల్ కుమార్ తెలిపారు.

1000 కోట్లు వసూలు చేయబోతున్న తొలి ఇండియన్ హీరో.

1000 కోట్లు వసూలు చేయబోతున్న తొలి ఇండియన్ హీరో.

ప్రభాస్ ఈ రోజు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. బాలీవుడ్ ఖాన్ త్రయం కంటే బిగ్. బాహుబలి 2 సినిమాతో 1000 కోట్లు వసూలు చేయబోతున్న తొలి ఇండియన్ హీరో. ఈ సినిమా కోసం అంతా చాలా కష్టపడ్డారు అన్నారు అని సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చారు.

English summary
Check out Cinematographer Senthil kumar speech at Baahubali 2 pre release function. Baahubali 2: The Conclusion (English: The One with Strong Arms) is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu