»   » వీణా మాలిక్‌ చిత్రానికి సివిల్‌ కోర్టు స్టే ...వివాదం(ఫోటోపీచర్)

వీణా మాలిక్‌ చిత్రానికి సివిల్‌ కోర్టు స్టే ...వివాదం(ఫోటోపీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : పాకిస్థాన్‌ నటి వీణా మాలిక్‌ నటించిన 'సిల్క్‌' చిత్రం ప్రదర్శనపై నగర సివిల్‌ కోర్టు స్టే విధించింది. సెప్టెంబరు 10వ తేదీ వరకు చిత్ర ప్రదర్శనను నిలిపి వేయాలని నిర్మాతలు, పంపిణీదార్లను కోర్టు ఆదేశించింది. చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సమాజం తప్పుదారి పట్టే అవకాశం ఉందంటూ కర్ణాటక నవ నిర్మాణ సేన అధ్యక్షుడు భీమా శంకర్‌ పాటిల్‌ వేసిన అర్జీని విచారించిన న్యాయమూర్తి ఈ ఆదేశాల్ని బుధవారం జారీ చేశారు.

త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. ఈ చిత్రంలో వీణామాలిక్ ఓ రేంజిలో రెచ్చిపోయి నటించింది.

వీణామాలిక్ హాట్ ఫోటోలతో మిగతా స్టోరీ...

డర్టి పిక్చర్

డర్టి పిక్చర్

నటి సిల్క్‌స్మిత జీవిత చరిత్ర చాలా ప్రాచుర్యం పొందింది. శృంగారతారగా ఆమె దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో రాణించారు. అయితే అర్ధాంతరంగా కన్నుమూశారు. సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో బాలీవుడ్‌లో ది దర్టీ పిక్చర్ పేరుతో రూపొందిన చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె పాత్రను పోషించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

క్లైమాక్స్

క్లైమాక్స్

సిల్క్ జీవిత కథతో ఇటీవల మలయాళంలో క్లైమాక్స్ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. స్మిత పాత్రను సానాఖాన్ పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఒరునడిగైయిన్ డైరీ పేరుతో అనువాదం అయింది. తాజాగా కన్నడంలో సిల్క్ జీవిత కథతో సిల్క్ సక్కత్ మగ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది.

ఇది వీణా మాలిక్ సిల్క్

ఇది వీణా మాలిక్ సిల్క్

ఇందులో పాకిస్తాన్ నటి వీణామాలిక్ నటిస్తోంది. త్రిసూల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 16 భాషలలో అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారని త్రిసూల్ తెలిపారు.

నగ్నంగా ఫోజ్ లు

నగ్నంగా ఫోజ్ లు

పాకిస్థాన్ భామ వీణా మాలిక్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రస్తుతం తన నటిస్తున్న సినిమాల వరకు అందాల ప్రదర్శనకు మరింత పదను పెడుతూ హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది.

భారీ అంచనాలతో...

భారీ అంచనాలతో...

ఈ సంవత్సరం విడుదలైన కన్నడ సినిమాలన్నింటిలోకెల్లా వీణా మాలిక్ నటించిన ‘సిల్క్ సక్కత్ హాట్' చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన అందాల ప్రదర్శనతో వీణా మాలిక్ ఈచిత్రం వైపు చాలా మందిని ఆకర్షించింది.

రియాల్టీ షో ల ద్వారా...

రియాల్టీ షో ల ద్వారా...

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలో తన కెరీర్ ప్రారంభించిన వీణా మాలిక్.....తద్వారా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది. దాల్ మే కుచ్ కాలా హై, జిందగీ 50-50 చిత్రాల్లో నటించింది. అయితే ఈచిత్రాలు ఆమెకు బాలీవుడ్లో పెద్దగా బ్రేక్ ఇవ్వలేక పోయాయి. దీంతో సౌతిండియా వైపు గేర్ మార్చింది. ఆమె ఆశించినట్లుగానే పలు దక్షిణాది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

సెక్సీ లుక్ తో...

సెక్సీ లుక్ తో...

సౌత్‌లో తొలిసారి ఆమె నటించిన కన్నడ చిత్రం ‘సిల్క్ సక్కత్ హాట్'. ఈచిత్రం పూర్తిగా హీరోయిన్ చుట్టూ తిరిగే సినిమా కావడంతో ఆమె పాత్రే కీలకంగా మారింది. ఈ సినిమా కోసం వీణా మాలిక్ హాట్ అండ్ సెక్సీగా స్కిన్ షో చేసింది. అందాల ఆరబోతలో ఆమె జోరు చూసి దక్షిణాదిన మరిన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి.

మొత్తం అందాల ఆరబోతే...

మొత్తం అందాల ఆరబోతే...

‘సిల్క్ సక్కత్ హాట్' సినిమా నిర్మాణ దశ నుండే వీణామాలిక్ హాట్ ఫోటోలు విడుదల చేయడం మొదలు పెట్టారు. దీంతో సినిమా ఏ రేంజిలో ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేవలం కన్నడ ప్రేక్షకులే కాదు....ఇతర బాషల ప్రేక్షకులను ఆకర్షించగలిగింది.

వీణామాలిక్ కష్టం...

వీణామాలిక్ కష్టం...

ఈ సినిమా కోసం వీణా మాలిక్ తన శక్తి మేర కష్టపడింది. ఇటు పెర్ఫార్మెన్స్ విషయం తీసుకున్నా, అటు అందాల ఆరబోత విషయం గమనించినా....సినిమాకు పబ్లిసిటీ కల్పించడానికి ఆమె ఎంచుకున్న విధానాలు చూసినా ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ సినిమా ప్రచారం కోసం వీణా మాలిక వారం రోజుల పాటు బెంగుళూరులోనే ఉండి వివిధ చానల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. సినిమాకు మంచి హైప్ తెచ్చే ప్రయత్నం చేసింది.

భారీగానే..

భారీగానే..

వీణా మాలిక్ నటించిన ‘సిల్క్ సక్కత్ హాట్' చిత్రాన్ని కర్ణాటకలో భారీగా రిలీజ్ చేసారు. దాదాపు 140 థియేటర్లలో విడుదల చేసారు. కర్ణాటక మార్కెట్, వీణా మాలిక్ లాంటి తారల స్థాయితో పోలిస్తే ఇది భారీ రిలీజ్ అని చెప్పుకోవచ్చు. సిల్క్ సక్కత్ హాట్ చిత్రానికి త్రిశూల్ దర్శకత్వం వహించారు. వెంకటప్ప నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వీణా మాలిక్, అక్షయ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

English summary
Bollywood actress Veena Malik’s Kannada movie “Silk Sakkath Hot Maga” has hit cinema screens around India and is running successfully.But Civil Court gave a stay on it. The film released across 140 screens in 50 theaters, including those that normally do not screen Kannada films, in Mangalore, Udupi, Hyderabad and Mysore. Malik went to see the film during its first show on the first day of its release with co-star Akshay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu