»   » 'డిక్టేటర్‌' హిందీ రీమేక్ పై దర్శకుడు క్లారిటీ

'డిక్టేటర్‌' హిందీ రీమేక్ పై దర్శకుడు క్లారిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ , శ్రీవాస్ డైరెక్షన్ లో డిక్టేటర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల డిక్టేటర్ సినిమా బాలీవుడ్ కు వెళ్తుందని, దానిని శ్రీవాసే తెరకెక్కిస్తారని మీడియాలో భారీగా ప్రచారం జరగింది. ఈ విషయమై దర్శకుడు శ్రీవాస్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు .

శ్రీవాస్ మాట్లాడుతూ...'డిక్టేటర్ చిత్రం బాలీవుడ్ లో తెరకెక్కనుందనే వార్త వట్టి పుకారే అని తేల్చి చెప్పిన శ్రీవాస్ , ఈ చిత్ర నిర్మాణంలో ఈ రోస్ సంస్థ భాగస్వామి కావడం వలనే కొంతమంది అలా అనుకొని ఉండొచ్చు అని ఆయన తెలిపారు. అజయ్ దేవగన్ కథానాయకుడిగా ఈ చిత్రం బాలీవుడ్ లో తెరకెక్కునుందని, దీని కోసం ఓ సంస్థ ముందుకు వచ్చిందనే వార్త పచ్చి అబద్ధం అంటూ ఆ వార్తలలో అసలు ఏమాత్రం నిజం లేదు' అని పేర్కొన్నారు శ్రీవాస్ .


ప్రస్తుతం ఈ చిత్రం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో షూటింగ్ జరుపుకుంటుండగా, ఇందులో ఓ పాటను షూటింగ్ చేస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతుండగా, డిసెంబర్ 20న అడియో విడుదల కార్యక్రమం జరగనుంది..


Clarity on Dictator's bollywood remake

 
చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.


తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.


ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Grapevine has it that Bollywood actor Ajay Devgn would reprise the role played by Balayya in Dictator remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu