»   » ఎన్టీఆర్, నాగ చైతన్య పోటా పోటీగా ఒకే రోజు...

ఎన్టీఆర్, నాగ చైతన్య పోటా పోటీగా ఒకే రోజు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, నాగ చైతన్య బాక్సాఫీసు బరిలోకి పోటా పోటీగా దూసుకొస్తున్నారు. ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్‌' విడుదల ఆగస్టు 12న అని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా నాగచైతన్య 'ప్రేమమ్‌' కూడా అదే రోజునే విడుదలయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. 'ప్రేమమ్‌' వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా...షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడక తప్పలేదు. ఇద్దరి సినిమాలు విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్నాయి. మరి బాక్సాఫీసు వద్ద ప్రేక్షకుల మనసు గెలిచేది ఎవరో చూడాలి.

Clash between Jr NTR and Naga Chaitanya

జనతా గ్యారేజ్ సినిమా విషయానికొస్తే....
ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సమంత, నిత్యమేనన్‌ హీరోయిన్స్. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్‌లాల్‌ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

మళయాలంలో సూపర్ హిట్టయిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్లో 12వ సినిమా ఇది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని 'ప్రేమమ్' పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒరిజినల్ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో నటించిన వారు. మళయాలం ప్రేమంలో లెక్చరర్ పాత్ర పోషించి సాయి పల్లవి స్థానంలో శృతి హాసన్ నటిస్తోంది.

English summary
Junior NTR's upcoming Movie Janatha Garage has announced the release date as 12th August . Naga Chaitanya came to compete with Junior NTR's Movie Janatha Garage. Still Naga Chaitanya's Premam Movie is under production. But the producer aiming for release on 12th August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu