»   » 'సుప్రీమ్': వికలాంగుల రిస్కీ ఫైట్ ఇలా తీసారు(వీడియో)

'సుప్రీమ్': వికలాంగుల రిస్కీ ఫైట్ ఇలా తీసారు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ మూవీ మంచి కలెక్షన్లతో థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని సెంటర్లలో ఈ మూవీకు ప్రేక్షకులు నీరజనాలు పడుతున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ సీన్స్ లో నటించిన ఆనంద్ అండ్ టీమ్ ని ఈ మధ్యనే దర్శక,నిర్మాతలు సత్కరించారు కూడా.

ఈ నేపధ్యంలో దిల్ రాజు ఈ మూవీలోని క్లైమాక్స్ ఫైట్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వికలాంగుల చేత అనీల్ రావిపూడి చేయించిన ఫైటింగ్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మరి ఆ మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

అనీల్ రావిపూడి స్క్రీన్ ప్లే, సాయి ధరమ్ తేజ్ పర్‌ఫార్మెన్స్, రాశీఖన్నా అందాలు, సాయి కార్తీక్ సంగీతం సినిమాను సమ్మర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా చేసింది. ఇక సుప్రీమ్ మూవీ సక్సెస్ ను యూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ...దిల్ రాజు నిర్మించడంతో సినిమాకు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లే సినిమా పూర్తి స్దాయి ఫన్ తో ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకుంది.

Climax Fight Making From Supreme !!

మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సుప్రీమ్ చిత్రం చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడనే చెప్పాలి. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంతో మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వసూల్ చేసి, వీకెండ్ పూర్తయ్యే సరిసి 9.93 కోట్లు వసూలు చేసారు. ఈ వసూళ్లు సాయిధరమ్ కేరీర్‌లో హయ్యస్ట్ ఫస్ట్ డే వసూళ్లుగా రికార్డులకెక్కాయి.

ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఇందులో నటించటం ప్లస్ అయ్యింది. అలాగే కథకు కీలకంగా మారిన బాల నటుడు మైఖేల్ గాంధీ ఈ మూవీ సక్సెస్ కి కారణం అయ్యాడు. మొత్తంగా సుప్రీమ్ మూవీ సాయి ధరమ్ తేజ్ కి మంచి సక్సెస్ ని ఇచ్చిందని అంటున్నారు. బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్, నిరుత్సాహ చిత్రాల తరువాత వచ్చిన సుప్రీమ్...మెగా ప్రేక్షకులను బాగా అలరించిందని అంటున్నారు.

English summary
The climax making scene from Sai Dharam Tej’s latest release Supreme has received enormous response from the audiences. Watch how did makers manage shooting the risky shots!!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu