»   » దర్శకుడు రాజమౌళికి దక్కని అవార్డు!

దర్శకుడు రాజమౌళికి దక్కని అవార్డు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి CNN-IBN ఇండియా-2012 అవార్డుకు నామినేట్ యిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం CNN-IBN వారు వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో సౌతిండియా నుంచి కేవలం రాజమౌళి మాత్రమే నామినేట్ అయ్యారు. ఈగ చిత్రానికి గాను రాజమౌళి నామినేట్ అయ్యే అవకాశం దక్కింది. ఈ కేటగిరిలో ఇంకా అమీర్ ఖాన్ అండ్ సత్యమేవ జయతే టీం, ఇర్ఫాన్ ఖాన్, రణబీర్ కపూర్, శ్రీదేవి, విద్యా బాలన్ కూడా నామినేట్ అయ్యారు.

  తాజాగా...ఇందుకు సంబంధించిన విజేతల లిస్టు ప్రకటించారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో రాజమౌళి నామినేట్ అయినప్పటికీ ఆయనకు అవార్డు దక్కలేదు. హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఎంటర్ టైన్మెంట్ రంగంలో CNN-IBN 2012 అవార్డు దక్కించుకున్నారు. 'పాన్ సింగ్ టోమర్' అనే హిందీ సినిమాలో, 'ది అమేజింగ్ స్పైడర్ మేన్', 'లైఫ్ ఆఫ్ పై' చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కు గాను ఇర్ఫాన్ ఖాన్ ఈ అవార్డు దక్కించుకున్నారు.

  ఇక ఇతర రంగాల్లో అవార్డులు దక్కించుకున్నవారి వివరాల్లోకి వెళితే...
  రాజకీయ రంగంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ CNN-IBN 2012 అవార్డు దక్కించుకున్నారు. ఇక్కడ బిజేపీని అధికారంలోకి తేవడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు గాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా కు సంబంధించిన యూసఫ్ హమీద్ CNN-IBN 2012 అవార్డు దక్కించుకున్నారు.

  ఇక పబ్లిక్ సర్వీస్ రంగంలో... నారాయణ హృదయాల ద్వారా సేవ చేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవి శెట్టి ఈ అవార్డు అందుకున్నారు. స్పోర్ట్స్ రంగంలో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అవార్డు దక్కించుకున్నారు. అమీర్ ఖాన్ మరియు సత్యమేవ జయతే టీంకు స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు దక్కింది.

  English summary
  Recognising the remarkable achievements and contributions of Indians who have tirelessly worked towards strengthening India’s foundation, CNN-IBN announced the winners of the Indian of the Year 2012. At a star-studded awards ceremony held in New Delhi, winners across Politics, Sports, Entertainment, Business and Public Service categories were announced. In entertainment category Telugu director Rajamouli was one of the aspirant but has lost in voting.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more