»   » షాక్ :రేప్ కేసులో కో డైరెక్టర్ ... అరెస్టు

షాక్ :రేప్ కేసులో కో డైరెక్టర్ ... అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 2010 లో నిర్మించిన పీప్లీ లైవ్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ వ్యంగ్య చిత్రానికి రిజ్వీ, ఫరూకీ లు సహ దర్శకులుగా పనిచేసారు. ఇప్పుడు ఒక మహిళ పై అత్యాచారానికి పాల్పడిన అభియోగంపై సహ దర్శకుడు మహ్మద్ ఫారూకీని డిల్లీ పోలీసులు అరెస్టు చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఫారూకీ అమెరికాకు చెందిన 35 మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అభియోగం నమోదుచేశారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 19న కేసు నమోదు చేసినట్లు ఒక పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

నిందితుడైన ఫారూకీని అరెస్ట్‌ చేసి సాకేత్‌ కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అతడికి జులై 6 వరకూ జుడీషియల్‌ కస్టడీ విధించిందని ఆయన వివరించారు. ఈ ఘటనపై ఫరూకీ భార్య, దర్శకురాలు, రచయిత అనూషా రిజ్విని సంప్రదించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

Co -Director Arrested On Rape Charges

పూర్తి వివరాల్లకి వెళితే...

'పీప్లీ లైవ్' చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేసిన మహ్మద్ ఫారూకీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు నమోదయినట్లు పోలీసులు తెలియజేశారు. 35 ఏళ్ల ఓ అమెరికన్ వనితపై ఫారూకీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఈకేసులో పేర్కొన్నారు.

2015 మర్చి 28న పీప్లీ లైవ్ కో డైరెక్టర్ అమెరికన్ వనితపై లైంగికదాడికి పాల్పడ్డాడని, జూన్ 19న కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన అతడిని సాకేత్ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతడికి జూలై 6వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.

కొలంబియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న అమెరికన్ మహిళ ఓ పనిపై భారత్ వచ్చిన సమయంలో అతడు ఈ పని చేసినట్లు తెలిసింది.

English summary
Mahmood Farooqui, the writer and co-director of Aamir Khan produced Peepli Live, has been arrested by the Delhi Police on rape charges. The director reportedly raped a 35 year old American national on the 28th of March.
Please Wait while comments are loading...