»   » పాక్ నంబర్ నుంచే ఆ కాల్స్ వచ్చాయ్... దావూద్ పై సినిమా రిలీజ్ ఆపేసారు

పాక్ నంబర్ నుంచే ఆ కాల్స్ వచ్చాయ్... దావూద్ పై సినిమా రిలీజ్ ఆపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కాఫీ విత్ డి' సినిమా విడుదలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. సునీల్ గ్రోవర్, అంజనాసుఖానీ, దిపన్నీటా శర్మ, జాకీర్ హుసేన్, పంకజ్ త్రిపాఠిలు 'కాఫీ విత్ డి' సినిమాలో నటించారు. ఈ సినిమా నుంచి దావూద్ ఇబ్రహీం పాత్రను తొలగించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోపాటు గ్యాంగస్టర్ చోటా షకీల్ లు హెచ్చరించారు.

ఈ మేరకు ఈ చిత్ర నిర్మాతలు వినోద్ రమణి, డైరెక్టర్లు విశాల్ మిశ్రా, సునీల్ లకు వరుసగా బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారని సమాచారం. పాకిస్థాన్‌ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి డాన్ దావూద్ ఇబ్రహీం గత పదిరోజుల్లో ఐదుసార్లు తమకు ఫోన్ చేసి బెదిరించాడని చిత్ర నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము తీస్తున్న ఈ సినిమాకు సంబంధించి దావూద్ ఫోనులో బెదిరించారని చిత్ర నిర్మాతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. మొత్తం మీద ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర దర్శకుడు విశాల్ చెప్పారు. ఈ సినిమాలో దావూద్ పాత్రలో బాలీవుడ్ స్టార్ రిషికపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ , హుమా ఖురేషి, శృతి హాసన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Coffee with D release postponed

ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. తాము తీసిన మూవీలో కొన్ని సీన్లు డిలీట్ చేయాలని, లేనిపక్షంలో విడుదల చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారని వారు తెలిపారు. డీసీపీ బీకే సింగ్ కథనం ప్రకారం..

బాలీవుడ్ లేటెస్ట్ మూవీ 'కాఫీ విత్ డి' ప్రమోషన్ ఈవెంట్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి.,,ఈ మూవీలో దావూద్ ఇబ్రహీంపై జోకులు ఉన్న సీన్లు, అతడ్ని చెడుకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఖచ్చితంగా తొలగించాలని, లేకపోతే మూవీనే విడుదల చేయవద్దని ఛోటా షకీల్ ఆఫీస్ నుంచి తమకు కాల్స్ వచ్చాయిన వారు ఫిర్యాదుచేశారు.

తమకు ముంబైతో సబంధంలేని కారణంగా ఢిల్లీలో ఫిర్యాదు చేస్తున్నట్లు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పారు. మొదట వారికి ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ నుంచి కాల్స్ చేసి తాము చెప్పింది చేస్తారా లేదా అని హెచ్చరించారు. సునీల్ గ్రోవర్ (కపిల్ శర్మ షో ఫేమ్) అనే జర్నలిస్టు దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేసే సీన్లు ఈ మూవీలో ఉన్నాయి. ఇవే సమస్యకు దారితీశానని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ వివరించారు.

English summary
The release of Vishal Mishra's underworld comedy Coffee with D has been indefinitely postponed. While the makers remain tight-lipped about the reason, it is suspected that repeated threats by Dawood Ibrahim's associates are the cause
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu