»   » నాగ్ బాలయ్యల మధ్య విభేదాలున్నాయా..?? మరి బాలకృష్ణ పై నాగ్ ఈ ట్వీట్??

నాగ్ బాలయ్యల మధ్య విభేదాలున్నాయా..?? మరి బాలకృష్ణ పై నాగ్ ఈ ట్వీట్??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ, నాగార్జునల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదనేది సినీ ఇండస్ట్రీలో పాపులర్ రూమర్. నాగార్జున వున్న చోటకి బాలయ్య రాకపోవడం, ఇద్దరి ఇళ్లల్లో వేడుకలకి, పార్టీలకీ ఒకరిని ఒకరు పిలుచుకోకపోవడం ఆ రూమర్స్ ని బలపరిచింది. అక్కినేని మరణం సమయంలో నాగార్జునకి బాలయ్య సంతాపం తెలియజెప్పకపోవడం, అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించకపోవడంతో ఈ విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. అంతే కాదు మొన్నటికి మొన్న తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థానికి కూడా బాలయ్యకి ఆహ్వానం పంపలేదు నాగార్జున.

అయితే నాగార్జున ఈ పుకార్లు అన్నిటికీ ఫుల్స్టాప్ పెడుతూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి తన మనఃపూర్వక అభినందనలు చెప్పి తమ మధ్య దూరం లేదని స్పష్టం చేసారు. బాలయ్యకి, క్రిష్కి 'శాతకర్ణి' విడుదల సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ, తనకి చారిత్రిక చిత్రాలంటే చాలా ఇష్టమని, ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని కోరుకుటున్నట్టు చేసిన ట్వీట్ నందమూరి అభిమానులకూ బాగానే నచ్చింది.

ఈ మధ్య నాగ్ పంథా మారింది అదివరకు అందరితోనూ అంటీ ముట్టనట్టే ఉండే ఈ హీరో గత మూడేళ్ళుగా చాలా యాక్టివ్ అయిపోయాడు తన సహచర నటుల సినిమాలకు బెస్ట్ విషెస్ చెబుతూ ఫ్యాన్స్ లో మరింత ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి డికేడ్ తర్వాత చేసిన చిత్రం ఖైదీ నెం 150. ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకి మూవీ రిలీజ్ సందర్బంగా బెస్ట్ విషెస్ అందించాడు నాగ్. ఇక ఈ రోజు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేశాడు.

తనకి హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ .. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నట్టు నాగ్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తో పాటు టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే నాగార్జున చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకు కారణం బాలయ్య మూవీ లాంచింగ్ వేడుక నాడు చిరు, వెంకీలతో పాటు నాగ్ కూడా వస్తారని అందరు భావించారు. కాని నాగ్ గైర్హాజరీతో బాలయ్యకి, నాగ్ కి చెడిందేమోనంటూ ప్రచారం జరిగింది. కాని నాగ్ చేసిన ఈ ట్వీట్ తో అన్ని పుకార్లకు బ్రేక్ పడింది. మడమ తిప్పని తెలుగు వీరుడు శాతకర్ణి కథతో తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోండగా ఈ చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేయనుందో చూడాలి.

English summary
"Wishing #Balayya,DirKrish &team all the best for #GautamiPutraSatakarni/I love watching historicals. Let this one create history!!" Tweeted Nagarjuna
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu