»   » స్టార్‌వార్ : ఇద్దరు స్టార్‌ హీరోల బూతుల బాగోతం

స్టార్‌వార్ : ఇద్దరు స్టార్‌ హీరోల బూతుల బాగోతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాండల్‌వుడ్‌ కన్నడ సినీ పరిశ్రమ అగ్రహీరోలు సుదీప్‌, దర్శన్‌ల వివాదం రచ్చకెక్కింది. కన్నడ సినీ రంగంలో ఇద్దరు అగ్రహీరోలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. బహుబాషా నటుడు కిచ్చ సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమానులు మాటల యద్దంతో ఒకరి హీరోను ఒకరు బండబూతులు తిట్టుకుంటున్నారు.

ట్వీట్‌ల రూపంలో

ట్వీట్‌ల రూపంలో

రెండు రోజులుగా ట్వీట్‌ల రూపంలో విమర్శించుకుంటున్నారు. ‘సుదీప్‌ నాకు మిత్రుడు కాదు... తోటి నటుడు మాత్రమే' అని దర్శన్ ఓ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత పలు చానెళ్ళలో ఇరువురి స్నేహంపై ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఇదే సమయంలో మెజస్టిక్‌ చిత్రాన్ని దర్శనకు అవకాశం కల్పించింది తానే అని సుదీప్‌ మరో ట్వీట్‌ చేశారు.

ఓ కన్నడ టీవీ చానల్

ఓ కన్నడ టీవీ చానల్

కొన్ని సంవత్సరాల క్రితం సుదీప్ ఓ కన్నడ టీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ తాను మొదటి సారి దర్శన్ ను చాముండేశ్వరి స్టూడియోలో చూశానని,. ఆ రోజు దర్శన్ క్లాప్ బోర్డు పట్టుకుని నిలుచుని ఉన్నాడని, అన్నాడు. అంటే దర్శన్ ఇంకా నటుడుకూడా అవకముందే అప్పటికే తాను హీరో అని సుదీప్ పరోక్షంగా చెప్పాడు.

స్యాండిల్ వుడ్ లో దర్శన్ ను

స్యాండిల్ వుడ్ లో దర్శన్ ను

స్యాండిల్ వుడ్ లో దర్శన్ ను మాస్ హీరోగా నిలబెట్టిన మెజస్టిక్ సినిమాలో నన్ను హీరోగా నటించమని దర్శకుడు సత్య మొదట తన దగ్గరకే వచ్చారని అయితే తాను ఆ సినిమాలో నటించడానికి నిరాకరించడంతో మెజస్టిక్ సినిమాలో దర్శన్ ని హీరోగా తీసుకున్నారనీ , అసలు దర్శన్ ను సూచించింది తానే అని సుదీప్ చెప్పాడంటూ ఇటీవల ఓ వీడియో క్లిప్పింగ్ కన్నడ చానల్స్ లో పదేపదే ప్రసారం అవుతోంది.

మెజస్టిక్ సినిమా

మెజస్టిక్ సినిమా

ఇక ఈ క్లిప్పింగ్ కి సమాధానం గా అందుకు సాక్ష్యాలు చూపాలంటూ దర్శన్ సవాల్‌ విసిరాడు. తాజాగా మంగళవారం ‘మర్యాద ఇస్తే నేను అదేరీతిలో వ్యవహరిస్తా...'అంటూ సుదీప్‌ మళ్ళీ ట్వీట్ చేసాడు. దాంతో ఇక వివాదం మరింత జోరు మీదకొచ్చి అభిమానులదాకా వచ్చేసింది.

రెండు రోజులుగా వీరి మధ్య సాగుతున్న

రెండు రోజులుగా వీరి మధ్య సాగుతున్న

రెండు రోజులుగా వీరి మధ్య సాగుతున్న మాటల సవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇరువురి అభిమానులు రోడ్డెక్కే స్థాయికి చేరుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన దర్శన్ అభిమానులు, సుదీప్‌ పట్ల నిరసన వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో అభిమానులు పరస్పర వాదనలు సాగిస్తున్నారు. స్యాండల్‌వుడ్‌ పెద్దలు జోక్యం చేసుకోకుంటే మరిన్ని పరిణామాలు తప్పవనిపిస్తోంది.

English summary
Rift Between Darshan and Sudeep Comes to Limelight Again and Darshan Revealed the Actual Reason Behind it. Here is the Reason Between Darshan and Sudeep Rift.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu