»   » ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...

ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబయి : అత్త పోరుపై ఆ మధ్య కాలం దాకా సినిమాలు వచ్చి ఆగిపోయాయి. తర్వాత కోడళ్లు సాధింపు సీరియల్స్ పాపులర్ అయ్యాయి. దానకి ఉమ్మడి కుటుంబాలు... కలిసి కాపురాలు తగ్గాయన్నారు. అయితే ఈ కాలంలో కూడా ఐశ్వర్యారాయ్ వంటి స్టార్ హీరోయిన్ కి అత్తపోరు తప్పలేదని ముంబై మీడియా సమాచారం. అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ కూడా ఇప్పుడు ఇలాంటి విషయంలో వార్తల్లోకెక్కింది. బిగ్‌బీ కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఉందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం అత్తాకోడళ్లకు పడడంలేదన్న వార్తలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇది నిజమేనేమో అనేలా చేశాయి.

బచ్చన్‌ కోడలు ఐశ్వర్య వేరు కాపురం పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అత్త జయాబచ్చన్‌ వైఖరితో ఐశ్వర్య ఇమడలేకపోతోందట. ఐశ్వర్యారాయ్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జయాబచ్చన్‌ జోక్యం చేసుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంవల్లే అత్తాకోడళ్ల మధ్య మనస్ఫర్ధలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధం లేకుండా చేసే ప్రతిపని, తీసుకునే ప్రతి నిర్ణయం గురించి అత్త జయాబచ్చన్‌కు ఐశ్వర్య చెప్పాల్సిందేనట. అత్తతో రోజూ ఎదుర్కొంటున్న సమస్యతో విసుగెత్తిపోయి, ఓపిక నశించిపోవడంతో స్వతంత్రంగా ఉండాలని ఐశ్వర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులు ఐశ్వర్యను ఆమె పేరుతో (అత్తింటి పేరు లేకుండా) పిలవడంతో చూసిన జయబచ్చన్‌ కోపంతో ఊగిపోయిందంటున్నారు. అంతేగాక ఆ ఫొటో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఐశ్వర్యా... ఐశ్వర్యా అంటూ పిలవడం ఏమిటి... ఆమె ఏమైనా మీ స్నేహితురాలా, క్లాస్‌మేటా?'' అని ప్రశ్నించింది. ఇదంతా మీడియా ఎదుటే చోటుచేసుకోవడంతో అత్త జయాబచ్చన్‌ వ్యవహారశైలి కోడలు ఐశ్వర్యరాయ్‌ను నొప్పించింది. ఈ సంఘటన తర్వాత అత్తపై అసంతృప్తి వ్యక్తంచేయకపోయినా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలుస్తోంది.

అయితే భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌లపై ఐశ్వర్యకు ప్రేమాభిమానాలు ఏమీ తగ్గలేదు. అభిషేక్‌ ఆమెకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తారట. దానికితోడు మామ అమితాబ్‌ ఆమె వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోరని అంటున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఐశ్వర్య అభీష్టానికి అత్తగా జయాబచ్చన్‌ అడ్డుచెబితే ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి ముందే భర్త, కుమార్తెతో కలిసి అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలని ఐశ్వర్యారాయ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూద్దాం.

English summary
Bollywood's first family, The Bachchans, are not only a brand but they also stand for managing to be successful not only in their profession but also in their personal lives. The Bachchan family members - patriarch and Bollywood legend Amitabh Bachchan, his immensely talented wife (probably the most talented member of the family) Jaya, their son Abhishek and his more popular and successful wife Aishwarya Rai - always put up a united front in public. No sound of discord had been heard ever since Abhishek got married to Aishwarya a few years ago.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu