»   » నగ్నంగా మార్చ్‌ఫాస్ట్‌ చేసానంటున్న దర్శకుడు

నగ్నంగా మార్చ్‌ఫాస్ట్‌ చేసానంటున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాస్టళ్లో ఒక గేటు నుంచి మరో గేటు వరకూ ఒంటి మీద ఏమీ లేకుండా మార్చ్‌ఫాస్ట్‌ చేయించారు. నిజానికి 'త్రి ఇడియట్స్‌'లో చాలా తక్కువ చూపించాం. ఎఫ్‌ టీఐఐలో చేరినపుడు ఇంచుమించు అలాగే జరిగింది అంటూ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తన గతాన్ని తలుచుకున్నారు. 'త్రి ఇడియట్స్‌'లో చూపించినట్లు ర్యాగింగ్‌ సమయంలో మీరు కూడా ప్యాంట్లు విప్పేసి నిల్చున్నారా..? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇలా ఇచ్చారు. అలాగే స్క్రిప్టు తయారు చేసిన విధానం గురించి చెపుతూ..అభిజిత్‌ జోషి, నేనూ కలిసి కథ సిద్ధం చేసుకున్నాం. వేరే చిత్రాల్లో చూపించిన సన్నివేశాల కంటే కొత్తగా ఉండాలంటే మన జీవితంలో జరిగిన సంఘటనల్నే చూపించాలని నిర్ణయించుకొన్నాం. అలాగే మా స్నేహితుల జీవితాల్లోని సంఘటనల్ని కూడా జతపరిచాం. మా కాలేజీ రోజుల్లో జరిగిన వాటినే తలచుకొంటూ స్క్రిప్టు సిద్ధం చేశాం అన్నారు. 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'లగేరహో మున్నాభాయ్‌' తర్వాత వచ్చిన 'త్రి ఇడియట్స్‌' కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఆయన అమితానందంగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu