»   » వర్మ దెబ్బకొట్టాడంటూ కలర్స్ స్వాతి ఏడుపు

వర్మ దెబ్బకొట్టాడంటూ కలర్స్ స్వాతి ఏడుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే క్యారెక్టర్ ఏమిటి..ఎన్ని సీన్స్ ఉన్నాయి..అసలు తనది ప్రాధాన్యత ఉన్న రోలేనా అని ఆలోచించకుండా సైన్ చేసేసిన కలర్స్ స్వాతి ఇప్పుడు తీరిగ్గా విచారిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు సినిమాలో స్వాతి నటనకి అవకాశమున్న సీన్ గానీ, ఆమె కెరీర్ కి పనికొచ్చే సన్నివేశం గానీ లేకపోవటం..సినిమా డిజాస్టర్ కావటంతో ఏం చెయ్యాలో అర్దం కాని స్ధితిలో పడింది. సునీల్ సరసన చేసిన అప్పలరాజు ఆమెను పూర్తి దెబ్బకొట్టిందని సన్నిహితుల దగ్గర బాధపడుతోంది. వర్మ చిత్రం అనగానే పాత్ర ఏమిటి? అని ఆలోచించకుండా సంతకం పెట్టేశానని, ఇలా గుడ్డిగా ఏ చిత్రానికీ పనిచేయలేదని ఆమె చెప్పుకుంటోంది. అగ్రిమెంట్ అయ్యాక చేయననడం పద్ధతి కాదు కనుక తప్పనిసరి అని ఆ చిత్రంలో నటించానని స్నేహితుల దగ్గర వాపోతోందట.దానికి తోడు సంక్రాంతికి విడుదలైన గోల్కెండ హైస్కూల్ కూడా అస్సలు ఆడలేదు. దాంతో ఇప్పుడు ఏం చేయాలో ఫ్లాపుల హీరోయిన్ అనే ముద్రను ఎలా తొలగించుకోవాలో అర్థం కాక సతమతమవుతోంది. అటు తమిళంలోనూ ఆమెకు ఆఫర్స్ ఏమీ కనుచూపుమేరలో కనపడటం లేదు.

English summary
Colors Swathi is another female lead to Sunil as assistant director in 'Katha-Screenplay-Direction: Appalaraju' movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu