For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'లవ్' మ్యాటర్ పై కలర్స్ స్వాతి స్పందన

  By Srikanya
  |
  హైదరాబాద్ : పెళ్లి గురించి ఇప్పుడేమీ ఆలోచనలు లేవు. మంచోడు దొరికితే చేసుకుంటా. ప్రేమ అనేది బోరింగ్ కాన్సెప్ట్. ఎవరన్నా నాకు ప్రపోజ్ చేస్తే నవ్వొస్తుంది. అసలు 'లవ్' అంటే ఏంటి? అంటోంది కలర్స్ స్వాతి. నిఖిల్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా 'స్వామి రారా'. సుధీర్‌వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించారు. ఈ నెల 22న 'స్వామి రారా' విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు...

  ప్రత్యేకించి ఫలానా డ్రీమ్‌రోల్ అంటూ ఏమీ లేదు. మంచివాళ్లతో పనిచేస్తూ నా కెరీర్‌లో ప్రస్తుతం హ్యాపీగా ఉన్నా. స్లో అండ్ స్టడీగా వెళ్తున్నా. తెలుగమ్మాయిల్ని ఇండస్ట్రీలో ప్రోత్సహించరనే సంగతి గురించి ఆలోచించడం టైమ్ వేస్ట్. ఎవరికి ఏం రాసిపెట్టుందో అదే వస్తుంది. దేవుడు కూడా నేను హ్యాండిల్ చేయలేనిదాన్ని నాకివ్వడు. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని. పిచ్చిపిచ్చిగా సినిమాలొచ్చినా, దాన్ని నేను హ్యాండిల్ చెయ్యాలిగా అంది.

  ఇక 'కలర్స్' ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన హీరోయిన్లు ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు. నేనలాగే ఉన్నాను. మిగతా వాళ్లు వస్తున్నారు, వెళ్తున్నారు. నేను గొప్పలు చెప్పుకోవడం లేదు. అయితే 'ఇందులో అన్నీ ఉన్నాయి' అనే పాత్ర కోసం వెయిట్ చేస్తున్నా. మేం పప్పెట్స్ (తోలుబొమ్మలు) లాంటివాళ్లం. మా వద్దకు వచ్చిన పాత్రల్ని చేసుకుపోవడమే మాకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది.

  తాజా చిత్రం గురించి చెప్తూ.. ఈ సినిమాలోని ప్రతి పాత్రకీ వినాయకుడి విగ్రహం కావాలి. దాని కోసమే ప్రతి పాత్రా కష్టపడుతుంది. అంటే సెకండాఫ్ అంతా చేజింగ్స్ ఉంటాయి. అవి ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా వినాయకుడి విగ్రహం మీదే స్టార్ట్ అవుతుంది. ఇది లైట్‌హార్టెడ్ హ్యాపీ ఫిల్మ్. అలా అని సిల్లీ ఫిల్మ్ కాదు. ఎంటర్‌టైన్ చేస్తుంది. నిజ జీవితంలో నాకూ, ఆ పాత్రకీ అస్సలు సంబంధం ఉండదు. జర్నలిజం చదువుకునే ఓ మామూలమ్మాయిగా కనిపిస్తా. నిఖిల్ మాత్రం దొంగగా నటించాడు. మంచి దొంగేలే. అతను దొంగ అనే సంగతి నాకు తెలీనంత అమాయకురాల్ని అన్నమాట సినిమాలో అని చెప్పుకొచ్చింది.

  తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు గురించి చెప్తూ... తెలుగులో నవదీప్‌తో కలిసి చేస్తున్న 'బంగారు కోడిపెట్ట' షూటింగ్ చివరికొచ్చింది. అందులో నాది చలాకీ అమ్మాయిగా చాలా మంచి కేరక్టర్. ఫహద్‌తో చేసిన మలయాళ చిత్రం 'ఆమెన్' ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. ఇది మ్యాజికల్ రియలిజమ్ మీద నడిచే పీరియాడికల్ ఫిల్మ్. నేను కేథలిక్ క్రిస్టియన్ అమ్మాయిగా నటించా. తమిళంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వాళ్లు తీస్తున్న ఓ సినిమా చేస్తున్నా. మరో మూడు తమిళ సినిమాలకు సంతకం చేశాను. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలేవీ చేయడం లేదు. నాకంత రెస్పాన్సిబిలిటీ వద్దు.

  English summary
  Nikhil and Colors Swathi starrer Swamy Ra Ra is finally getting released this month. Made as comedy thriller, the movie's trailers have received good response and the songs composed by newcomer Sunny have also been appreciated by music lovers. "The movie will provide maximum entertainment and we are sure that audiences would be thrilled with many scenes as this is a comedy thriller. Planning to release the movie on 22nd of this month," Sandeep Koratala, co-producer, said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X