»   » మురికివాడ పిల్లగా మారిపోయిన అల్లరిపిల్ల స్వాతి

మురికివాడ పిల్లగా మారిపోయిన అల్లరిపిల్ల స్వాతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా రంగుల సినీ ప్రపంచంలోకి ప్రవేశించిన అల్లరిపిల్ల స్వాతి మురికివాడ పిల్లగా మారిపోయింది. "సుబ్రమణ్యపురం" అనే చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయం అయిన స్వాతి మళ్లీ "పోరాలీ" అనే చిత్రంతో తమిళంలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో స్వాతి మురికివాడకు చెందిన అమ్మాయిలా కనబడనుంది. ఇది స్వాతికి మరో అద్భుతమైన పాత్ర అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం కోసం మన పదహారణాల తెలుగుమ్మాయి పక్కా తమిళ భాషను కూడా నేర్చుకుంటుందట. ఈ చిత్రంలో స్వాతి క్యారెక్టర్ చాలా బబ్లీగా, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు.

కాగా.. పోరాలీ చిత్రాన్ని శశికుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఐదుగురు సమర్థులను వెతికే పనిలో డైరెక్టర్ సముతిరకని ఉన్నాడు. ఇప్పటికే శశికుమార్, స్వాతి, అల్లరి నరేష్, వసుంధరలను ఖరారు చేయగా మరొకరి కోసం వేట కొనసాగుతోంది. శశికుమార్, సముతిరకని ఇదివరకటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హ్యూమర్, సెంటిమెంట్, యాక్షన్‌ల కలయితే ప్రేక్షకులను అలరిస్తుందని, 80 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నామని డైరెక్టర్ వివరించారు.

English summary
MAA TV colors fame Telugu girl Swathi is back in Tamil cinema with ‘Poraali’ directed by Samuthirakani. In this film Swathi is playing a slum dweller role. “It is yet another meaty role for her,” according to unit sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu