»   » స్నేహా ఉల్లాల్ ..హోలీ విషెష్ సెక్సీగా.. (ఫొటో)

స్నేహా ఉల్లాల్ ..హోలీ విషెష్ సెక్సీగా.. (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. స్నేహ ఉల్లాల్ కు చేతిలో సినిమాలు లేవు కానీ ఇలా ఎప్పటికప్పుడు తన అందాలతో ఏదో ఒక ఫోజు ఇచ్చి అదరకొడుతోంది. హోలీ సందర్బంగా ఇలా ఫొటో దిగి తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తన ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Colourful wishes from Sneha Ullal

తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.

సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.

తెలుగులో కరెంట్‌, సింహా తదితర చిత్రాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్‌కి తమిళ చిత్రాల్లో నటించే ఛాన్సు లభించిందీ ఆ మధ్య. 'వేదం' చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తుంటే అందులో శింబు సరసన నటిచింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.

English summary
Today Sneha Ullal wished her fans in a colourful style.
Please Wait while comments are loading...