»   » అందులో ఎవరి తప్పూ లేదు: కలర్స్ స్వాతి

అందులో ఎవరి తప్పూ లేదు: కలర్స్ స్వాతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు సరైన ప్రోత్సాహం దక్కడం లేదు, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు అని నేను చెప్పడానికీ, ఇతరులు వినడానికీ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మార్కెట్టే కీలకం. ఎవరిని ఎంచుకొంటే సినిమాకి మార్కెట్‌ అవుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని హీరోయిన్స్ ని ఎంపిక చేసుకొంటారు. అందులో ఎవర్నీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం''. అంటూ కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది.

అలాగే నా వరకు నా కెరీర్‌పై సంతృప్తిగా ఉన్నాను. యువతరం హీరోలు, యువ దర్శకులతో పనిచేస్తూ వెళుతున్నా. తొలిరోజుల్లో మాత్రం స్టార్‌ హీరోలతో కలిసి నటించలేకపోతున్నానే అని కొంచెం ఆందోళనకి గురయ్యేదాన్ని. పక్కనున్నవాళ్లు కూడా 'స్వాతీ ఫేస్‌ బుక్‌ ఓపెన్‌ చెయ్యి, పార్టీలకు వెళ్లు, అలా చెయ్‌, ఇలా మాట్లాడు' అని చెప్పేవాళ్లు. కానీ కొన్నాళ్ల తర్వాత అవేవీ అవసరం లేదని నాకు అర్థమైంది. చిత్ర పరిశ్రమలో విజయాలే కీలకం. మంచి కథల్ని ఎంచుకొన్నప్పుడే విజయాలు దక్కుతుంటాయి అన్నారు.

తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన 'బంగారు కోడిపెట్ట' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ''అచ్చమైన తెలుగు కథ 'బంగారు కోడిపెట్ట'. సంక్రాంతి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నేను భానుమతి పినిశెట్టి అనే యువతిగా నటించాను. ఎనిమిదో తరగతి ఫెయిల్‌ అయిన ఆ అమ్మాయి ఎలాగోలా ఇంగ్లిష్‌ నేర్చుకొని ఓ షాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తుంటుంది.

తల్లిదండ్రులు లేకపోవడంతో అక్క దగ్గరే ఉంటుంది. ఎప్పటికైనా కష్టాల నుంచి గట్టెక్కి ఇల్లు, కారు కొనుక్కోవాలనేది ఆమె కల. అందుకోసం కొన్ని అడ్డదారుల్ని వెతుక్కొంటుంది. ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నది తెరపైనే చూడాలి. ఇది కొత్త కథేం కాదు. కానీ ఆ కథని చెప్పే విధానంలో కొత్తదనం కనిపిస్తుంటుంది. తప్పకుండా అందరినీ మెప్పించే ఓ మంచి చిత్రమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది.

English summary
Navdeep, Swati starrer Bangaru Kodipetta is gearing up for release on February 27. The film has been directed by Raj Pippalla, who had earlier made Sumanth starrer Boni. Sunita Thati has produced the film under Guru Films banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X