అసెస్టెంట్ డైరక్టర్ గా అవతారమెత్తుతున్న కలర్స్ స్వాతి
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంలో కలర్స్ స్వాతి ఎంపికైన సంగితి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర కేవలం అసెస్టెంట్ డైరక్టర్ గానే సాగుతుందని, సునీల్ ప్రక్కన హీరోయిన్ గా కాదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. సునీల్, స్వాతి కాంబినేషన్ బాగుండదు కదా అన్న దానికి సమాధానంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో సునీల్ అమలాపురం నుంచి హైదరాబాద్ సినిమా డైరక్టర్ అవుదామని వచ్చే పల్లెటూరు అమాయకుడుగా కనిపిస్తారు. పూర్తి సినిమా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రం ఈ రోజే(27 ఆగస్టు) అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. శ్రీదేవి గెస్ట్ గా వస్తున్న ఈ పంక్షన్ లో హీరోయిన్ గా ఆయన ఎవర్ని ప్రకటిస్తారో చూడాలి.
స్వాతి సునీల్ అప్పలరాజు మర్యాద రామన్న రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి swathi sridevi appalaraju sunil maryada ramanna ram gopal varma


Click it and Unblock the Notifications