For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రైమ్ కామెడీ... ('బంగారు కోడి పెట్ట' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : స్వామి రారా చిత్రంతో కలర్స్ స్వాతికి మళ్లీ డిమాండ్ రావటమే కాక,క్రైమ్ కామెడీలకు చాలా కాలం తర్వాత హిట్ రూపంలో కలిసివచ్చింది. దాంతో ఈ సారి నవదీప్ ని వెంటేసుకుని మరో క్రైమ్ కామెడీతో రెడీ అయ్యి...ఈ రోజు థియోటర్ లో దిగుతోంది. సుమంత్ తో బోణి చిత్రం డైరక్ట్ చేసిన రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. U/A సర్టిఫికేట్ ని అందుకున్న ఈ చిత్రం వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడుస్తుందని చెప్తున్నారు.

  భాను(కలర్స్ స్వాతి) ఓ మధ్య తరగతి అమ్మాయి. భయమంటే ఏమిటో తెలియని కుర్రాడు వంశీ(నవదీప్). ఏ పనైనా సొంతంగానే చేయాలనుకొంటాడు. ఎవరికీ ఏ విషయంలోనూ దొరకడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనేది వంశీ కోరిక. అచ్చం అలాంటి అబ్బాయి కోసమే ఎదురు చూసింది భానుమతి. తను ఎదగాలంటే అలాంటి ఓ టక్కరి కుర్రాడు అవసరమనేది భాను ఆలోచన. అందుకే గురి చూసి ఓ వాలు చూపు విసిరింది. దెబ్బకి పడిపోయాడు. ఆమె ఇచ్చిన ఆలోచనతో దొంగతనానికి ప్రయత్నిస్తాడు. అతడు ఆ పని చేయగలిగాడా.. అసలు ఎందుకు ఆ పనికి పూనుకున్నాడు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఏ రీతిన సాగిందో తెరపైనే చూడాలంటున్నారు. ఇది మొదటి కథ.

  Colours Swathi's ‘Bangaru Kodipetta’ preview

  పిజ్జా డెలివరీ బోయ్‌గా పని చేస్తూ, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఓ కుర్రాడు చేసే ప్రయత్నమే రెండో కథ. కవలల నేపథ్యంలో మూడో కథ సాగుతుంది. ఈ మూడు కథలు ఒకచోట కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. సంక్రాంతి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ క్రైమ్ కథాచిత్రమిది. మూడు విభిన్న కథలతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది.

  నవదీప్ మాట్లాడుతూ...'బంగారు కోడిపెట్ట' రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో నా కేరక్టర్ పేరు వంశీ. కొంచెం గ్రే (నెగటివ్) షేడ్‌లో వెళ్తుంటుంది. ఇందులో నేను చేసే పనులు ప్రేమ కోసమా, లేక డబ్బు కోసమా అనేది చివరలో తెలుస్తుంది. భానుమతిగా నటించిన స్వాతికీ, నాకూ మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయి. ఇది వారం నుంచి పది రోజుల మధ్య జరిగే కథ. ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. జాక్‌పాట్ అనే ఉద్దేశంలో 'బంగారు కోడిపెట్ట' అనే టైటిల్ పెట్టారు.

  దర్శకుడు రాజ్ పిప్పళ్ల మాట్లాడుతూ...అందరికీ ఓ బంగారు కోడిపెట్ట ఉంటుంది. దానితో ఆనందం,మనశ్సాంతి దొరుకుతుంది. దాని కోసం తట్ట, బుట్ట క్రింద వెతుకుతాం. ఈ సినిమాలో రియలైజ్ అయ్యేదేమిటంటే...బంగారు కోడిపెట్ట మన మనస్సులోనే ఉంది . సంక్రాంతి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనిషి తన జీవితంలో రకరకాల అడ్డదారులను వెదుకుతుంటాడు. జీవితం మాత్రం తనదైన దారినే చూపెడుతుందన్న అంశాన్ని ఇందులో ఆసక్తికరంగా చెప్పాం. దొంగతనం, పేకాట, కోడి పుంజు అపహరణ, సినిమా ఆడిషన్స్‌ తదితర అంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

  హీరోయిన్ కలర్స్ స్వాతి మాట్లాడుతూ... సునీత, రాజ్ లతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రియల్ జర్నీలా ఉంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. సునీ ఎనర్జీ నైస్ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ... ఈ సినిమాకు అందరూ తలో కాస్త ఇన్ పుట్స్ ఇచ్చి ఈ సినిమాను చేసాం. బెటర్ మెంట్ చేసాం. న్యూ జనరేషన్ మూవీ వచ్చింది అని అందరూ అంటారు అన్నాడు.

  బ్యానర్: గురు ఫిలిమ్స్
  నటీనటులు: నవదీప్, స్వాతి రెడ్డి,సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచాలన తదితరులు.
  మాటలు: ప్రసాద్‌ వర్మ పెన్మత్స,
  సంగీతం: మహేష్‌ శంకర్‌,
  పాటలు: అనంతశ్రీరామ్‌.
  సినిమాటోగ్రఫీ: సాహిర్,రజా
  ఎడిటర్ : చంద్రశేఖర్,ధర్మేంద్ర కాకరాల
  యాక్షన్ : రామ్,లక్ష్మణ్
  పాటలు: అనంత్ శ్రీరామ్
  పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ దొంకాడ
  నిర్మాత: సునీత థాటే
  కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం : రాజ్ పిప్పళ్ళ
  విడుదల తేదీ: మార్చి 7,2014

  English summary
  Navdeep, Swathi Reddy starrer film Bangaru Kodipetta finally releasing worldwide in theatres from March 7th.The film has been directed by Raj Pippalla. Oneindia telugu updates Bangaru Kodipetta movie review in a while
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X