»   » అలీ హీరోగా 'ఆలీబాబా ఒక్కడే దొంగ'

అలీ హీరోగా 'ఆలీబాబా ఒక్కడే దొంగ'

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: చాలా కాలం గ్యాప్ తర్వాత అలీ హీరోగా ఓ చిత్రం మొదలవుతోంది. ఆ చిత్రం టైటిల్ 'ఆలీబాబా ఒక్కడే దొంగ'. ఈ చిత్రానికి ఫణి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ సినీ క్రియేషన్స్ పతాసంపై బొడ్డాడ శివాజి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

దర్శకుడు ఫణి ప్రకాష్ మాట్లాడుతూ... ఎస్.ఐ అవుదామనుకుని వచ్చి దొంగగా మారిన ఓ యువకుని కథ ఇది. అలీ ఇంతవరకూ ఈ తరహా కామెడీ థ్రిల్లర్ చేయలేదు. పూర్తి కామెడీతో సినిమా ఉంటుంది అని చెప్పారు.

నిర్మాత బొడ్డాడ శివాజి మాట్లాడుతూ...ఈ నెల 18న షూటింగ్ మొదలడతాం. 10 రోజులు పాటు హైదరబాద్ లోనే తొలి షెడ్యూల్ చేస్తాం. అలీ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుంది..అని తెలిపారు.

తణికెళ్ల భరణి, జీవా,షఫీ, రఘుబాబు, దువ్వాసి మోహన్, రాంజగన్, కొండవలస, దాసన్న,రామరాజు, చంద్రశేఖర్, పృధ్వీ తదితరులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి శ్రీకాంత్, కెమెరా: జాన్, కో డైరక్టర్: ఎన్ అనీల్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సాయిబాబు వాసిరెడ్డి.

English summary
After a gap Comedian Ali is playing a lead hero in a new film titled Alibaba Okkade Donga. This is going to be a comedy thriller and it will be directed by Phani Prakash. The director says the film is about a guy who wants to become Sub-Inspector of Police but eventually ends up as a thief.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu