twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు కాళ్లు, చేతులు ఉండవు, మరోసారి అలా చేయొద్దు: అలీ వార్నింగ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ali STRONG Counter To Media

    రెండు కాళ్లు, చేతులు ఉండవు, మరోసారి అలా చేయొద్దు అంటూ.... నటుడు అలీ సినీ ఇండస్ట్రీ తరుపున జరిగిన నిరసన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో టీవీ ప్రజెంట్ తెలుగు సినిమా పరిశ్రమలోని నటీమణుల గురించి అత్యంత హేయమైన, నీచమైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన 'మా' సభ్యులు, మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

    రెండు చేతులు, రెండు కాళ్లు ఉండేవి కావు, తీసేస్తారు

    రెండు చేతులు, రెండు కాళ్లు ఉండేవి కావు, తీసేస్తారు

    మీడియా, ఆర్టిస్టులు మొగుడు పెళ్లాల వంటి వారు. ఏదైనా గొడవ వస్తే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండాలే తప్ప.... పబ్లిక్‌లోకి వెళితే, రోడ్డు పాలైపోతాం, నవ్వుల పాలైపోతాం. కానీ నటీమణుల గురించి ఓ టీవీ చానల్‌లో అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అది ఛానల్ కాబట్టి ఏమీ చెప్పలేక పోతున్నాం. అదే రోడ్డు మీద వెళ్లే మనిషి అలా మాట్లాడి ఉంటే... రెండు చేతులు, రెండు కాళ్లు ఉండేవి కావు, తీసేస్తారు... అని కమెడియన్ అలీ అన్నారు.

    అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది

    అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది

    తమిళనాడులో, కర్నాటకలో సినిమా వారి గురించి చిన్న ముక్క తపపుగా చెప్పినా కూడా పరిస్థితి చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసీ, చూసీ భరించి... వారి మానాన వారే పోతారు అని చాలా సార్లు ఈ తెలుగు ఇండస్ట్రీ అనుకున్నది. కానీ ఇక మీదట అలా ఉండదు. ఇంకో రకంగా ఉంటుంది.... అని అలీ అన్నారు.

    దాసరి ఉండి ఉంటేనా...

    దాసరి ఉండి ఉంటేనా...

    దాసరి నారాయణరావు గారు చనిపోయి ఏ లోకంలో ఉన్నారో కానీ ఉండి ఉంటే ఇంకో రకంగా ఉండేది. మనకు ఇండస్ట్రీలో అలాంటి గాడ్ ఫాదర్స్ చాలా మంది ఉన్నారు. సినిమా తల్లి ఒడి చాలా పెద్ద ఒడి. ఎవరినైనా బుజ్జగిస్తుంది, జో కొడుతుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. మనం అంతా ఇక్కడే ఉంటాం, బ్రతికేది ఇక్కడే, చచ్చేది ఇక్కడే... అని అలీ అన్నారు.

    మొదటి అడుగు నాదే, వార్నింగ్ అనుకున్నా ఫర్వాలేదు

    మొదటి అడుగు నాదే, వార్నింగ్ అనుకున్నా ఫర్వాలేదు

    ఇక మీదట అలాంటిది జరిగితే మొదటి అడుగు నాది ఉంటుంది. ఇది వార్నింగ్ అని కాదు, మీరు ఏమనుకుంటారో అనుకోవచ్చు. ఇది గవర్నమెంటు సెటిల్ చేయడానికి గవర్నమెంటు సమస్య కాదు. ఇది సినిమా సమస్య, మనమే తేల్చుకోవాలి. మరొకసారి అందరికీ చెబుతున్నాను దయచేసి ఇక తగ్గండి, అలా చేయడం మానేయండి... అని అలీ అన్నారు.

    English summary
    Comedian Ali Fires On Abusing Actresses. Movie Artist Association (MAA) Chalana Chitra Nirasana Press Meet held at Hyderabad. Rakul Preet Singh, Manchu Lakshmi, Jhansi Laxmi, Tammareddy Bharadwaj, Navdeep, Banerjee, Paruchuri Venkateswara Rao, BV Nandini Reddy, Harish Shankar, Anitha Chowdhary, N Shankar, Ali, Sivaji Raja, Paruchuri Gopala Krishna, Brahmaji, Y Kasi Viswanath, Srikanth, Hema, Gemini Kiran, Pragathi, Jyothi at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X