»   » హాస్య నటుడు ఏవిఎస్‌ కొంప కొల్లేరు ?

హాస్య నటుడు ఏవిఎస్‌ కొంప కొల్లేరు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసినపుడు మనిషి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో వినోదాత్మకంగా చెప్పే కధాంశంతో ఏవీఎస్‌ త్వరలో '2012 - కొంప కొల్లేరు' అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయాలని ఆయన మీడియాకు శనివారం హైదరాబాద్ లో తెలియచేసారు. అలాగే ఆయన మాట్లాడుతూ..'2012 - కొంప కొల్లేరు' చిత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను. అలాగే 'బాపు-రమణలు నాటిన మొక్కను నేను. అందరి సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను.

బాపు చిత్రం 'శ్రీనాథ కవిసార్వభౌముడు"లో అన్నగారు ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. అది నటుడిగా తొలిసినిమా. రిలీజెన తొలిసినిమా మాత్రం 'మిస్టర్‌ పెళ్లాం". ఆ సినిమాకి నంది అందుకున్నా. ఆ క్రమంలోనే నటుడిగా జోరుమీద ఉన్నప్పుడే దర్శకుడినయ్యాను. 'అంకుల్‌" చిత్రం ఆర్థికంగా నష్టాన్ని తెచ్చినా 'నంది"నిచ్చి మంచి పేరు మాత్రం తెచ్చింది. గతేడాది 'కోతిమూక" మాత్రం దర్శకుడిగా నిరాశపరిచింది. నేను నటించిన తాజా చిత్రం 'పరమవీరచక్ర" సంక్రాంతికి విడుదలవుతోంది. ఎల్లపుడూ తోచిందే చేశా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, నటుడిగా పూర్వ వైభవం దక్కాలని ఆశిస్తున్నా" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu