For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ మృతి

  By Srikanya
  |

  హైదరాబాద్‌ : హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ గారు కోలుకుంటారంటూ వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందారు. కొండాపూర్ లోని కిమ్స్ హాస్పటిల్ లో ఆయన ఈ రోజు ఉదయం మరణించారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.

  సంక్రాంతి సందర్భంగా స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురవడంతో తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఈ నెల 20న నగరంలోని కిమ్స్‌కు తరలించారు. గుండెలో సమస్యలు ఏర్పడడంతో గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ చేసినట్లు కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించారు. తర్వాత ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

  గురువారం ఉదయం ఆయనకు డయాలసిస్‌ కూడా నిర్వహించినట్లు ఆసుపత్రిమెడికల్‌ సూపరింటెండెంట్‌ నారాయణ బాబు పేర్కొన్నారు. పలు దఫాలుగా ఆయన ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేశారు. కాగా ఎంఎస్‌ మృతి చెందినట్లుగా జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. ఈ లోగా ఈ విషాదం చోటు చేసుకుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కెరీర్ విషయానికి వస్తే...

  మన తెలుగు తెరపై తాగుబోతు పాత్రలంటే ముందు గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ పేరే. ఇప్పుడంటే తాగుబోతు రమేష్ వచ్చాడు కానీ ఇంతకుముందు తాగుబోతు పాత్ర అంటే ఎమ్మెస్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తనదైన కొత్త తరహా మేనరిజమ్‌తో ఈ తరహా పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లు దాటింది. ఈ ప్రయాణంలో 700ల చిత్రాలు పైగా పూర్తి చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు ఎమ్మెస్ నారాయణ.

  Comedian MS Narayana Died

  ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పారు.

  ఇక మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.

  అలాగే... సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.

  English summary
  Comedian MS Narayana died today at KIMS Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X