»   » తాగుబోతు రమేష్...ఎంగేజ్ మెంట్ అయ్యింది (ఫొటో)

తాగుబోతు రమేష్...ఎంగేజ్ మెంట్ అయ్యింది (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ ప్రక్క టాలీవుడ్ మొత్తం...మంచు మనోజ్..వివాహం హడావిడిలో ఉంటే...మరో ప్రక్క ప్రముఖ హాస్య నటుడు...తాగుబోతు రమేష్..నిశ్చితార్దం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఫేస్ బుక్ లో ఫొటో పెట్టి...బ్లెస్సింగ్స్ కోరారు. అయితే వివాహ తేదీ మాత్రం చెప్పలేదు. తన తాగుబోతు నటనతో పేరుతెచ్చుకున్న రమేష్ ...జీవితంలో ఒకింటి వాడు అవుతున్న ఈ శుభ సందర్బంలో ... వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఇక్కడ ఆయన ఎంగేజ్ మెంట్ ఫొటోని చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Comedian Thagubothu Ramesh Gets Engaged

రమేష్ కెరీర్ విషయానికి వస్తే...

తాగుబోతు రమేష్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం తాగుబోతు ఆర్‌జీవి. మేఘనా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ దర్శకుడు. ఎన్.ఎం. కాంతారాజ్ ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.... తాగుబోతు అనే పేరుతో నటుడిగా ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఇటీవల ధన్‌రాజ్‌తో కలిసి ఏకేరావు పీకేరావు చిత్రంలో ఓ హీరోగా నటించాను. తాగుబోతు ఆర్‌జీవి చిత్రంలో మాత్రం సోలో హీరోగా నటిస్తున్నాను. నన్ను నమ్మి తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం గర్వంగా వుంది. ఇటీవలే కన్నడలో ఈ చిత్రాన్ని ప్రారంభించాం అన్నారు.

కన్నడంలో రెండు చిత్రాలు రూపొందించిన నాకు తెలుగులో ఇది తొలి సినిమా అని దర్శకుడు త్రిశూల్ తెలిపారు. అలీ, పృథ్వీ, రఘుబాబు,జయప్రకాష్‌రెడ్డి,పోసాని కృష్ణమురళి, షకీలా తదితరులు నటిస్తున్నారు.

English summary
Tollywood's most popular comedians, Thagubothu Ramesh, got engaged in a star studded ceremony. Ramesh himself has put this photograph up on his Facebook page and sought blessings from all his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu