సాయి పల్లవిపై మనసుపడ్డ వెన్నెల కిషోర్.. ఏం చేశాడో తెలుసా!
మలయాళ తార సాయి పల్లవిపై ప్రముఖ హస్యనటుడు వెన్నెల కిషోర్ తన అభిమానాన్ని ట్విట్టర్‌లో చాటుకొన్నారు. లవ్ సింబల్స్ తో కూడిన ఎమోజీలను పెట్టి ప్రేమను చాటుకొన్నారు.
మలయాళ చిత్రం ప్రేమమ్‌లో నటించిన సాయి పల్లవి దక్షిణాదిలో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకొన్నది. ఆమె అభిమానుల్లో సగటు ప్రేక్షకులే కాకుండా సినీ నటులు ఉన్నారనే విషయం కాదనలేనిది. తాజాగా ట్విట్టర్‌లో ప్రముఖ హస్యనటుడు వెన్నెల కిషోర్ తన అభిమానాన్ని సాయి పల్లవిపై చాటుకొన్నారు.

ఎర్రటి చీరలో అందాలను ఆరబోస్తున్న సాయి పల్లవిపై మనసు పారేసుకున్నాడు. తన మనసులో భావాలను దాచుకోలేక సరదాగా ట్విట్టర్‌లో బయటపెట్టాడు. తన ట్విటర్ ఖాతాలో రెండు కళ్లల్లో లవ్ సింబల్స్ తో కూడిన ఎమోజీలను పెట్టి ప్రేమను చాటుకొన్నారు. వెన్నెల కిషోర్ అభిమానం సాయి పల్లవికి చేరిందా లేదా అనే విషయం ఆ తార స్పందిస్తే కానీ తెలియదు. అప్పటివరకు వెన్నెల కిషోర్, అభిమానులు వేచి చూడాల్సిందే.
sai pallavi vennela kishore premam malayalam tollywood సాయి పల్లవి వెన్నెల కిషోర్ ప్రేమమ్ మలయాళం టాలీవుడ్


Click it and Unblock the Notifications