»   » జనతా గ్యారేజ్ లో ఒక పాట కట్.... యాపిల్ బ్యూటీనేనా..?

జనతా గ్యారేజ్ లో ఒక పాట కట్.... యాపిల్ బ్యూటీనేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతాగ్యారేజ్ రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలే ఉంది. వరుసగా రెండు హిట్లు కొట్టిన జూనియర్ ఇప్పుడు ఈ సినిమాతో ఇంకో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలన్న కోరికతో ఉన్నాడు. సినిమా ఫలితం ఎలా ఉండబోతోందన్నది పక్కనపెడితే.. సినిమాపై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే టికెట్లు వేలం పాటలూ, అడ్వాన్స్ బుకింగ్ లూ అంటూ అభిమానులు ఎగబడుతున్నారు.

ఇప్పటికే ఏపీ లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సెప్టెంబర్ 1న అర్థరాత్రి, వేకువజామున వేసే షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడకు చెందిన కొందరు 'జనతా గ్యారేజ్' బెనిఫిట్ షో హక్కులను రూ.25 లక్షలు పెట్టి దక్కించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోతో డిస్ట్రిబ్యూటర్‌లు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.


కానీ తెలంగాణలో మాత్రం ఈ మార్పేమీ లేదు బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయి. హైదరాబాద్‌లో బెనిఫిట్ షో హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్ ఇతర ప్రాంతాల్లోని థియేటర్లలో ఆగస్టు 31 అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఇంకో న్యూస్ అభిమానులను కలవర పెడుతోంది.


ఫాలోయింగ్ ఉన్న హీరో

ఫాలోయింగ్ ఉన్న హీరో

టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. ఆయన సినిమా రిలీజవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు తొలి షో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే ముందే వేసే బెనిఫిట్ షోల టికెట్లు దక్కించుకోవడానికి అభిమానులు వేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు.


కొన్ని గంటల్లో

కొన్ని గంటల్లో

మరో కొన్ని గంటల్లో 'జనతా గ్యారేజ్' మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల హడావుడి మొదలైంది. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


అంచనాలు ఆకాశాన్నంటాయి

అంచనాలు ఆకాశాన్నంటాయి

షూటింగ్ పూర్తయి ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. బెనిపిట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దక్కించుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల టికెట్స్ పరిమిత సంఖ్యలో ఉండటం, అభిమానులు అపరిమితంగా ఉండటంతో వాటిని దక్కించుకునే క్రమంలో అభిమానులు పోటీ పడి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. చెన్నైలో టికెట్లను వేలం వేయగా భారీ ధర పలికాయి.


సీన్లకు కత్తెర

సీన్లకు కత్తెర

ఇక, మరో విషయమేంటంటే సినిమాలో సాధారణ టైమింగ్ ని మించి కంటెంట్ ఎక్కువగా ఉందని పది నిముషాల సీన్లకు కత్తెర పడినట్టు ఇటీవలి ఓ కథనం. అయితే ఆ కథనాలను కొట్టిపారేసిన డైరెక్టర్ కొరటాల.. తెలుగులో ఒక్క సీన్‌కు కూడా కట్ చెప్పలేదని వెల్లడించాడు.


కోత పడినట్టు అంగీకరించాడు

కోత పడినట్టు అంగీకరించాడు

మలయాళ వెర్షన్‌లో మాత్రం కొంత కోత పడినట్టు అంగీకరించాడు. ‘‘ఫైనల్ ప్రింట్ ఫిక్సయ్యాక ఒక్క సీన్ కూడా తీయలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా రిలీజయ్యాక జనాల స్పందన చూసి రెండో వారం నుంచి ఇంకో పది నిముషాల కంటెంట్ పెంచుదామనుకుంటున్నాం. అనిచెప్పాడు కానీ...


ఒక పాట తీసేయాల్సి వచ్చింది

ఒక పాట తీసేయాల్సి వచ్చింది

మలయాళ వెర్షన్‌లో మాత్రం ఒక పాట తీసేయాల్సి వచ్చింది. కొన్ని కామెడీ సీన్లనూ కట్ చేశాం'' అని స్పష్టం చేశాడు. కొంపదీసి ఇప్పుడు ఆ పాట కాజల్ చేసిన యాపిల్ బ్యూటీ అయ్యుంటుందా... తెలుగులోనూ తీసేస్తారా అన్న అనుమానం తోనే ఉన్నారు తెలుగు అభిమానులు.


కేరెక్టర్‌కు తగ్గట్టే

కేరెక్టర్‌కు తగ్గట్టే

కాజల్ చేసింది ఐటెం సాంగే అయినా.. సిచువేషన్‌కు తగిన పాట అని, నిర్మాతల సూచన మేరకే ఆ పాటకు ఆమెను ఎంపిక చేశామని చెప్పాడు. ఇక, ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ కోసం పోలేదని, పూర్తిగా కేరెక్టర్‌కు తగ్గట్టే నటించాడని చెప్పాడు కొరటాల.


యాపిల్ బ్యూటీ సాంగ్‌

యాపిల్ బ్యూటీ సాంగ్‌

తాను ఎలాంటి నటన కోరుకున్నాననో అలాంటి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడన్నాడు. హీరోయిన్లిద్దరికీ సినిమాలో సమ ప్రాధాన్యం ఉందని, రెండు కంటెంట్ ఉన్న పాత్రలని చెప్పాడు. అయితే.. మలయాళ వెర్షన్‌లో కట్ చేసిన ఆ పాటేదో మాత్రం కొరటాల వెల్లడించలేదు. యాపిల్ బ్యూటీ సాంగ్‌ను తీసేసి ఉండొచ్చని సినీ జనాలు భావిస్తున్నారు.


English summary
Buzz is that some scenes and one song chopped in Janatha Garage malayalam version so same will happen in telugu..?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu