twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినీ పరిరక్షణకు మహేష్, పవన్ లతో కమిటీ

    By Srikanya
    |

    తెలుగు సినీ పరిశ్రమలో గత అయిదు రోజులుగా సాగుతున్న సమ్మె మరో టర్న్ తీసుకుంది. హైదరాబాద్, చెన్నై ఫైటర్ల మధ్య నెలకొన్న వివాదం కాస్తా దిశ మారి, నిర్మాణ వ్యయం అదుపుపై చర్చకు దారితీసింది. ఎవరికి వారే యమునాతీరేగా ఉన్న మూడు ప్రధాన విభాగాలు ఒక్క తాటిపై నిలిచి సమస్యలు పరిష్కరించాలని నిర్చయించుకున్నాయి.

    సోమవారం రాత్రి ఓ రాత్రి ఓ హోటల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు రహస్యంగా సమావేశమయ్యారు. కార్మిక సంఘంతో నెలకొన్న వివాదంపై కన్నా, నిర్మాణ వ్యయం అదుపు పైనే ఇక్కడ ఎక్కు వ చర్చించారని తెలిసింది. నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరోలు, దర్శకులు సముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..అనువాద చిత్రాలను నిషేధించాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్రస్తావన తీసుకురాగా, ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు సమాచారం.

    ఇదే అంశాలపై మళ్ళీ మంగళవారం కూడా భేటీ కావాలని నిర్ణయించారు. దీనికి సంభందించి ఓ కమిటీని వేసినట్లు తెలిసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ మరో ఇద్దుర ముగ్గురు హీరోలతో పాటు,ఎస్.ఎస్.రాజమౌళి, వివి వినాయిక్, ఈశ్వరరెడ్డి మరో ఇద్దరు నిర్మాతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశం తీవ్రతను గమనిస్తే..మరో వారం పది రోజుల వరకూ షూటింగ్ లు జరిగే పరిస్ధితి లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 16 న నాగవల్లి చిత్రాన్ని విడుదల చేయాలా ..వద్దా అనే విషయం పైనా చర్చించారు.

    చిత్ర సీమలో జరిగే వేడుకలకు, ఇటువంటి సమావేశాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ సమావేశానికి రావడం చిరంజీవి, నాగార్జున, కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, రామ్ చఱణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజశేఖర్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు ఈ భేటీకి వచ్చారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, జీవిత, ఆహుతి ప్రసాద్, ఏవీఎస్, వేణు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్ర రావు, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి. వినాయిక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్,బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు డి.రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, దిల్ రాజు, కె అచ్చి రెడ్డి,స డివివి దానయ్య ఈ చర్చలో పాల్గొన్నారు.

    ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ ‌లతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ పరిస్థితిని పరిశీలించి మూడు రోజుల్లో తగిన సూచనలను నిర్మాతల మండలికి, దర్శకులకు అందజేస్తుంది. కాగా.. షూటింగ్‌లు ఆగిపోయిన నేపథ్యంలో మంగళవారం ఉదయం నిర్మాతల మండలి కీలక సమావేశం నిర్వహించనుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X