»   » సి కళ్యాణ్,వర్మ, భానుకిరణ్ లపై సినిమా

సి కళ్యాణ్,వర్మ, భానుకిరణ్ లపై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్ళూ వాస్తవిక గాధలను తెరకెక్కిస్తూ కీర్తి కెక్కారు.అయితే ఆయన్ని తెరకెక్కిస్తూ సినిమా ప్లాన్ చేస్తున్నారు వీరూ కె.నిర్మాత సి.కళ్యాణ్,మద్దెల చెరువు సూరి,భాను కిరణ్,రామ్ గోపాల్ వర్మ పాత్రలను పెట్టి ఈ సినిమాను 'కంపెని'టైటిల్ తో తీస్తున్నారు.అయితే ఆ పాత్రల పేర్లను మాత్రం కొద్దిగా మార్చాడు.

ఆ విషయం దర్సకుడు మాటల్లోనే...మద్దెలదరువు నూరి, బాలుకిరణ్, కె. చియాన్ అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా. 500 కోట్ల రూపాయల స్కామ్, మద్దెలదరువు నూరి అనే పాత్ర జైలునుంచి రిలీజైన కొద్ది రోజులకే హత్యకు గురవడం, ఆ హత్యకు కారకుడని అనుమానిస్తున్న బాలుకిరణ్ అనే అతను పరారీ కావడం వంటి అంశాలతో ఈ చిత్రం తయారవుతోంది అన్నారు.

ఇందులో మద్దెలదరువు నూరిగా సురేశ్, బాలుకిరణ్‌గా 'బద్రీనాథ్' ఫేమ్ హ్యారీ, కె. చియాన్‌గా దండపాణి, నూరి గర్ల్‌ఫ్రెండ్‌గా స్వాతివర్మ, రాంభూపాల్‌శర్మగా సుమన్‌శెట్టి నటించారు'' అని తెలిపారు.రమాశ్రీ క్రియేషన్స్ పతాకంపై వీరు కె. దర్శకత్వంలో లక్కరాజు రాధారాజేశ్వరి నిర్మిస్తున్న 'కంపెని' చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటోంది.ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

English summary
Director K Veeru mentioned that the his Company film revolves around three characters, Maddelacheruvu Suri spending his Jail tenure, K Chiyan who is on bail and Bhanu Kiran prime suspect in Suri's Case. Movie talks about the mystery of suri's murder based on a movie directed by "Ram Boopal Sharma" in a cinematic fashion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu