»   » ఆ సినిమా కూడా కాపీ కొట్టారంట, కేసు నమోదు!

ఆ సినిమా కూడా కాపీ కొట్టారంట, కేసు నమోదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమాలపై కాపీరైట్ వివాదాలు ఎక్కుయ్యాయి. కొందరు దర్శకుడు, నిర్మాతలు వేరే వాళ్ల స్టోరీలు ఎత్తుకొచ్చి, అసలు రచయితల అనుమతి లేకుండా సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వింటూనే ఉన్నాయి.

తాజాగా మరో సినిమా విషయంలో ఇలాంటి గొడవే జరుగుతోంది. 2013లో హృతిక్‌ రోషన్ హీరోగా వచ్చిన 'క్రిష్-3' సినిమా విషయంలో కాపీ వివాదం మొదలైంది. ఈ విషయంలో ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌ రోషన్‌పై ముంబయిలో కేసు నమోదైంది.

Complaint against Rakesh Roshan for 'stealing' 'Krrish 3' story

ఈ సినిమా స్టోరీని సూఅర్దాన్‌ అనే నవల నుంచి కాపీ కొట్టారంటూ రచయిత రూప్‌ నారాయణ్‌ సోంకార్‌ రాకేశ్‌పై కాపీరైట్‌ చట్టం కింద కేసు పెట్టారు. తాను రాసిన సూఅర్దాన్‌ పుస్తక కాపీలను కూడా పోలీసులకు అందజేశారు. 2010లో తానీ పుస్తకాన్ని ప్రచురించానని, మనిషిని, జంతువుని కలిపి సృష్టించిన కొత్త ప్రాణికి మాన్వర్‌ అని పేరు పెట్టి ఈ కథ రాశానని నారాయణ్‌ వివరించారు.

క్రిష్‌ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పాత్రే ఉంటుందని, తన అనుమతి లేకుండా తన కథను వారు కాపీ కొట్టారని రచయిత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబయి పోలీసులు రాకేశ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

English summary
A city-based novelist has accused Krrish 3 director-producer Rakesh Roshan of "stealing" the movie's story from his novel and filed a police complaint against him under the Copyright Act.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu