»   » ఆ హీరో చేసిన పనికి... ఓ అమాయకుడి బుర్రబద్దలైంది!

ఆ హీరో చేసిన పనికి... ఓ అమాయకుడి బుర్రబద్దలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఢిల్లీ: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మీద కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన శోభిత్ అనే వ్యక్తి అర్జున్ రాంపాల్ తన మీద దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదు చేసారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆదివారం తెల్లవారు ఝామున 3.30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని షాంగ్రి-లా అనే హోటల్లోని నైట్ క్లబ్ లో డిజె ప్లే చేయడానికి అర్జున్ రామ్ పాల్ వచ్చాడు. పని పూర్తయ్యాక అక్కడి నుండి అర్జున్ రామ్ పాల్ బయటకు వెలుతుండగా ఓ ఫోటోగ్రాఫర్ అతడిని ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. ఫోటోలు తీయవద్దని వారించినా సదరు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడంతో... కోపానికి గురైన అర్జున్ రామ్ పాల్ అతడి కెమెరా లాక్కోని జనం ఉన్నవైపు విసిరాడు.

Complaint filed against Arjun Rampal

అయితే అది వెళ్లి శోభిత్ అనే వ్యక్తి తలకు తాకింది. దీంతో అతడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కంప్లైంట్ తీసుకున్నామని, అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఏది ఏమైనా బాలీవుడ్ హీరో ఆవేశంలో కోపంతో చేసిన పనికి ఓ అమాయకుడి బుర్ర బద్దలవ్వడం చర్చనీయాంశం అయింది.

English summary
A man has filed a complaint with Delhi Police against actor Arjun Rampal for allegedly assaulting him at a five star hotel here. The complainant, Shobhit, claimed that the incident happened at around 3.30 AM on Sunday when Rampal was being clicked by a photographer and the actor allegedly grabbed his camera and threw it, hitting him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu