హీరో పై ' సింహాద్రి' నిర్మాత ఫిర్యాదు

By Srikanya

Duniya Vijay
బెంగళూరు : తాను నిర్మిస్తున్న సింహాద్రి చిత్రానికి డేట్స్‌ ఇచ్చి ప్రస్తుతం మరో చిత్రం చిత్రీకరణకు హాజరయ్యేందుకు నటుడు దునియా విజయ్‌ యత్నిస్తున్నారని ' సింహాద్రి' చిత్రం నిర్మాత ఆర్‌.ఎస్‌.గౌడర్‌ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ చలన చిత్ర వాణిజ్య మండలికి ఆయన నిన్న ఫిర్యాదు చేశారు. మండలి కార్యదర్శి ఎన్‌.ఎం.సురేష్‌, నిర్మాతల మండలి ప్రతినిధి సా.రా.గోవిందు వారికి రాజీ కుదిర్చేందుకు యత్నించారు.

తాను డిసెంబరు 9న కోబ్రా అనే చిత్నానికి ముహూర్తం పెట్టుకున్నానని, అయితే సింహాద్రి చిత్రీకరణ పూర్తయిన తరువాతే ఆ చిత్రంలో నటిస్తానని విజయ్‌ స్పష్టీకరించారు. ఇచ్చిన తేదీల్ని గౌడర్‌ తక్షణమే వినియోగించుకుంటే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని సా.రా.గోవిందు విలేకరులకు తెలిపారు.

గతంలోనూ నటుడు విజయ్‌పై జిగణి పోలీసు స్టేషన్‌లో అపహరణ కేసు నమోదైంది. తన కుమారుడు ఆనంద్‌ను తన అల్లుడే అపహరించాడంటూ నాగరత్న తండ్రి జయణ్ణ ఫిర్యాదు చేశారు. ఆనంద్‌కు, రశ్మి అనే యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు విజయ్‌ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని దీన్ని తాము అడ్డుకున్నందుకే తన కుమార్తె నాగరత్నకు విడాకుల్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఆనంద్‌ను అపహరించుకు వెళ్లిన విజయ్‌ తనకు, అపహరణకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.

చిన్న కారణాన్ని చూపి విజయ్‌ తన భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని నాగరత్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరో యువతిని వివాహం చేసేందుకు, తమ కుమారుడిని తమ నుంచి దూరం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు. దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. కన్నడ మీడియా కథనాల ప్రకారం.....విజయ్ తన విడాకుల పిటీషన్లో భార్య నాగరత్న తనను మెంటల్‌గా టార్చర్ పెడుతోందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X