»   » దర్శకుడు మారుతి పై కాపీ కంప్లైంట్

దర్శకుడు మారుతి పై కాపీ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Complaint Filed On Maruthi
హైదరాబాద్ : మారుతి,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం రాథ ...మొదలు కాకముందే కాంట్రావర్శిలో ఇరుక్కుంది. దర్శకుడుపై రైటర్స్ అశోశియేషన్ లో కాపీ స్క్రిప్టు అంటూ పిర్యాదు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల అశోశియేట్ సతీష్ ఈ విషయమై కంప్లైంట్ చేసారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... సతీష్ పాటల రచయిత సురేంద్ర కృష్ణ తో కలిసి ఓ స్క్రిప్టుని రెడీ చేసుకుని వెంకేటష్ కోసం వినిపించటం జరిగింది. ఇప్పుడదే స్క్రిప్టు కొద్ది మార్పులతో రాధ పేరుతో ప్రొడక్షన్ కి వెళ్తోందని కంప్లైంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివాదం దాసరి నారాయణ రావు దాకా వెళ్లినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు మారుతి ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.

ఇక వెంకటేష్‌ వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించారు. రాజకీయ నేతగా మాత్రం ఆయన తెరపై ఎప్పుడూ కనిపించలేదు. ఆ ముచ్చట త్వరలోనే తీరబోతోంది. వెంకటేష్‌ కథానాయకుడిగా యూనివర్సల్‌ మీడియా పతాకంపై 'రాధా' అనే చిత్రం తెరకెక్కబోతోంది. నయనతార కథానాయిక. మారుతి దర్శకత్వం వహిస్తారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. జనవరి 16న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ హోం మంత్రి పాత్రలో కనిపించి అలరించబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''మారుతి తయారు చేసిన కథ చాలా బాగుంది. కథ వినగానే వెంకటేష్‌గారు ఈ సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపారు. నయనతార కూడా కథ, పాత్రలపై ఆసక్తి కనబరుస్తూ నటించేందుకు ముందుకొచ్చింది. హోం మంత్రికీ, ఒక మధ్య తరగతి అమ్మాయికీ మధ్య సాగే ప్రేమాయణమే ఈ చిత్రం. ఇందులో వెంకటేష్‌ హోం మంత్రిగా కనిపించి వినోదం పంచబోతున్నారు. నయనతార మద్య తరగతి అమ్మాయిగా కనిపిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు. ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: జె.బి., కూర్పు: ఉద్ధవ్‌, సమర్పణ: డి.పార్వతి.

English summary
The political thriller movie “Radha” starring Venkatesh in male lead role and Nayantara in the female lead role is cookoing up ver fast. Now this movie under the direction of Maruti titled as ‘Radha’ lands in controversy. A case has been filed against the director. Srikanth Addala’s Associate director Satish has filed a case at writer’s association claiming rights of the Radha script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu