twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘26/11 ఇండియాపై దాడి’పై ఫిర్యాదు, సెన్సార్ ఆఫీసర్ చిర్రుబుర్రు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ముంబై దాడుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న '26/11 ఇండియాపై దాడి' చిత్రం విడుదల ఆంధ్రప్రదేశ్ లో నిలిపి వేయాలని రాంప్రసాద్ అనే న్యాయ వాది మంగళవారం సెన్సార్ బోర్డుకు వినతి పత్రం అందించారు. ఈ చిత్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, దేశ అంతర్గత భద్రతను ప్రశ్నించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.

    ముంబై దాడుల గురించి సినిమా తీయడం వల్ల దేశానికి జరిగే మేలు ఏమీ లేదని, పైగా ఈ సినిమా వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని రాంప్రసాద్ ఆందోళన వ్యక్తం చేసారు. దేశ భద్రత వ్యవస్థలోని డొల్లతనాన్ని మనమే బయట పెట్టుకోవడం తప్ప ఈ సినిమాలో మరేమీ లేదని అన్నారు.

    కాగా...న్యాయవాది వినతిపై తీసుకునే తదుపరి చర్యలపై పశ్నించేందుకు మీడియా వారు సెన్సార్ బోర్డు ఆఫీసర్ ధనలక్ష్మిని సంప్రదించగా ఆమె చిర్రుబుర్రులాడారు. అనుమతి లేకుండా లోనికి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సినిమాను సెన్సార్ చేసి సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమే మా పని, నిలిపి వేయాలనే నిర్ణయం తమ పరిధిలో ఉండదని స్పష్టం చేసారు.

    ముంబై పేలుళ్ల ఘటన ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం '26/11 ఇండియాపై దాడి'. ముంబైలో జరిగిన దాడి యావత్ దేశాన్ని వణికించింది. ఘటన జరిగిన తర్వాత అక్కడేం జరిగిందనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా కొన్ని నిజాల్ని సినిమా ద్వారా చూపించిన ప్రయత్నం చేస్తున్నామనేది వర్మ వాదన.

    ప్రజల కోసమే తీసిన సినిమా ఇది. కేవలం డబ్బు కోసమే ఈ సినిమా తీయలేదని, ఈ సంఘటన ఎలా జరిగింది? దాని పర్యవసానం ఏమిటి? అనేది వర్మ చూపించారని నిర్మాతల వాద. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆడియో ప్రసంగం ద్వారా వర్మ తెలియజేస్తూ - దాడుల వెనుక ఎవరున్నారు? పోలీసు వ్యవస్థ ఏం చేసింది? అన్నది చెప్పదలచాం అని అన్నారు.

    English summary
    Lawyer Ram Prasad filed Complaint against Ram Gopal Varma's upcoming movie '26/11 india Pai Daadi'. He demands stop the movie exhibition in AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X