»   » 'సింహా' సినిమాపై పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు

'సింహా' సినిమాపై పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శుక్రవారం రిలీజైన బాలకృష్ణ సింహా చిత్రంపై చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సింహా చిత్రానికి పెద్దలకు మాత్రమే అని సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా పోస్టర్లపై ముద్రించకుండా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని నిరసిస్తూ తెలంగాణ ఫిలిం టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌ మెంట్‌ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక సింహా రిలీజ్ రోజున.. సింహా టైటిల్ తనదేనని ఒయు విద్యార్థి వినోద్ ఆరోపించి వివాదం లేవతీసారు. సింహా టైటిల్ తనదేనంటూ తాను గతంలోనే ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసికెళ్లానని, అయితే వారు స్పందించలేదని వినోద్ అన్నాడు. దాంతో ఈ సినిమాను తెలంగాణ జిల్లాల్లో అడ్డుకుంటామని ఒయు జెఎసి హెచ్చరించింది. అయితే ఆ తర్వాత దీనిపై ఏ విధమైన సమస్య ఎదురుకాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu