twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఒంగోలు గిత్త' పై సెన్సార్ సభ్యుడు కంప్లైంట్

    By Srikanya
    |

    భీమవరం :ఒంగోలు గిత్త చిత్రానికి సెన్సార్‌బోర్డు 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చిందని, అయితే కొన్ని గోడ పత్రికలు, బ్యానర్లపై 'ఎ' సర్టిఫికేట్‌ పొందినట్లు వెల్లడిచేయలేదని కేంద్ర ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు డీవీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అతి తక్కువ సమయంలో ఈ సినిమా విడుదలవుతున్నందున సంబంధిత థియేటర్ల యాజమాన్యానికి రెండు రోజులు గడువిచ్చి ఎ సర్టిఫికేట్‌ లేని గోడపత్రికలు, బ్యానర్లను తొలగించాలని కోరారు. ఒంగోలు గిత్త చిత్రం ఈ రోజే(శుక్రవారం)ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల అవుతోంది.

    ఈ చిత్ర గోడపత్రికలు విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు, పబ్లిషర్లు, నిర్మాతలపై సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్‌కు విజ్ఞప్తి చేసినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు గిత్త చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బి.వి.యస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు.

    అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నగ్నంగా కనిపించే సీన్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. పాత్ర ఎలాంటిదైనా అందులో ఇట్టే ఒదిగిపోతారు ప్రకాష్‌రాజ్‌. తాజాగా మరో ప్రయత్నం చేశారాయన. ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపించబోతున్నారు... 'ఒంగోలు గిత్త' సినిమాలో. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు భాస్కర్‌ ధ్రువీకరించారు. కథ మలుపు తీసుకొనే క్రమంలో ఆ సన్నివేశం ఉంటుందన్నారు. భాస్కర్‌ మాట్లాడుతూ ''కథ మేరకు ప్రకాష్‌రాజ్‌ అలా నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఇవి కూడా వినోదాత్మకంగానే ఉంటాయి. ఆ సన్నివేశ ప్రాధాన్యం చెప్పగానే ఆయన అంగీకరించారు''అన్నారు. ఈ చిత్రంలో రామ్‌, కృతి కర్బందా జంటగా నటించారు. శుక్రవారం విడుదలవుతుంది.

    ఈ చిత్రం గురించి హీరో రామ్ మాట్లాడుతూ.. ''భాస్కర్‌ ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయా. అందరితో పాటు నేను కూడా ఆయన్ని ఓ క్లాస్‌ దర్శకుడిగానే చూశా. నాకు మాత్రం మాస్‌ కథ చెప్పారు. అయితే... ఆయన శైలి ఎక్కడా విడిచిపెట్టలేదు. తండ్రీ కొడుకుల అనుబంధాల్ని ఆయన కథలో బాగా చూపిస్తారు. ఇందులోనూ ఆ తరహా సన్నివేశాలున్నాయి. నేనెప్పుడూ ఇలాంటి కథలో నటించలేదు. అందుకే భాస్కర్‌తో ఓ మంచి ప్రేమకథా చిత్రం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి... ఈ కథకే ఓటేశా'' అన్నారు.

    English summary
    Central Censor Board Member DV Bala Subrahmanyam coplianted on Ongole Gitta Posters. Ram, Kriti Karbandha starrer Ongole Gitta relesing today(1st February). Bommarillu Bhaskar who has done class and family movies like Bommarillu, Parugu and Orange is directing a mass film for the first time. BVSN Prasad producer of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X