»   » కన్‌ఫర్మ్: జెనీలియా గర్భవతి అయింది(ఫోటో ఫీచర్)

కన్‌ఫర్మ్: జెనీలియా గర్భవతి అయింది(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ జెనీలియా గర్భం దాల్చిందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలు ధృవీకరణ కాలేదు. తాజాగా జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ స్వయంగా ఈ వార్తలను ధృవీకరించారు. తన భార్య జెనీలియా గర్భం దాల్చిన విషయం నిజమే అని ఓ ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జెనీలియా గర్భవతి అయిందనే వార్తలు ఏప్రిల్ నెల నుండి వినిపిస్తూనే ఎన్నాయి. ఆ మధ్య 'ఎల్లో' అనే చిత్రం ప్రీమియర్ షోకు తన భర్త రితేష్‌‌తో కలిసి హాజరైన జెనీలియా బేబీ బంప్‌తో కనిపించింది. పలువురు ఫోటో గ్రాఫర్లు జెనీలియా బేబీ బంప్ తమ కెమెరాల్లో బంధించారు. అప్పటి నుండే మీడియాలో ఈ వార్తల జోరు ఊపందుకుంది. అయితే ఇంతకాలం జెనీలియా, రితేష్ మౌనంగా వహించడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ హ్యాపీ

ఫ్యాన్స్ హ్యాపీ

సౌతిండియాలో నెం.1 హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జెనీలియాకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

 ప్రేమికులు

ప్రేమికులు

రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా మధ్య పెళ్లికి ముందు నుండే చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్' నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

 పదేళ్ల ప్రేమ

పదేళ్ల ప్రేమ

రితేస్ దేశ్ ముఖ్, జెనీలియా డిజౌజా మధ్య దాదాపు పదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.

సినిమాలకు దూరం

సినిమాలకు దూరం

పెళ్లయిన తర్వాత జెనీలియా పూర్తిగా సౌత్ సినిమాలకు దూరం అయింది. ముంబైలోనే ఆమె బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈ సంవత్సరాంతంలో తల్లికాబోతోంది

ఈ సంవత్సరాంతంలో తల్లికాబోతోంది

జెనీలియా ఈ సంవత్సరాంతంలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
Genelia's husband Ritesh Deshmukh has confirmed the news. While speaking to a leading daily candidly, the Bollywood actor has confirmed about her pregnancy. "Yes, she is and we are looking forward to the baby and are very excited about it," the Times of India quoted the actor as saying. The buzz on the issue had first appeared in April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu