»   »  అఫీషియల్: రజనీకాంత్‌ కొత్త చిత్రం దర్శకుడు ఖరారు

అఫీషియల్: రజనీకాంత్‌ కొత్త చిత్రం దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పా రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్నారు. కలైపులి ఎస్‌ ధాను నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కథ, దర్శకత్వం పా రంజిత్‌. రజనీ పబ్లిసిస్ట్‌ రియాద్‌ కె.అహ్మద్‌, రజనీ కూతురు సౌందర్య ట్విట్టర్‌ ద్వారా వివరాలను వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మలేషియాలో ప్రారంభమనుంది. 60 రోజులు మలేషియాలో షూటింగ్‌ తర్వాత థాయ్‌ల్యాండ్‌, హాంగ్‌కాంగ్‌తోపాటు చెన్నైలో షూటింగ్‌ చేయనున్నట్లు తెలిపారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్. రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

Confirmed. Rajinikanth's Next Film is With This Director

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట.

పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
soundarya rajnikanth ‏tweeted: "Appa s next confirmed :):):) Thanu uncle and beemji are going to rock this one !!! ". South superstar Rajinikanth has signed on the dotted line for his next film, which is still waiting for a name, to be directed by Pa Ranjith and produced by S Thanu. Two-film-old Ranjith, whose last outing was the critically-acclaimed Tamil thriller Madras.
Please Wait while comments are loading...