»   » ఖరారు: ఇంకో రీమేక్ కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్

ఖరారు: ఇంకో రీమేక్ కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్ ఇంకో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సారి కన్నడ పరిశ్రమ నుంచి ఆయన రీమేక్ కు ఆసక్తి చూపుతున్నారు. సంగోలి రాయన్న టైటిల్ తో 2012 లో విడుదలైన ఈ చిత్రం ని చూసిన సల్మాన్ ఇంప్రెస్ అయ్యి వెంటనే చేయటానికి సైన్ చేసినట్లు ముంబై సమాచారం. ఈ కన్నడ వెర్షన్ లో దర్శన్ హీరోగా చేసారు.

CONFIRMED: Salman Khan To Remake Darshan's 'Sangolli Rayanna'

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సంగోలి రాయన్న లో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, జయప్రద, సంతోషి కుమార్, నిఖిత తుకురాల్ లీడ్ రోల్స్ లో చేసారు. ఇప్పుడు హిందీలో చేస్తున్నట్లు వార్తలు రావటంతో ఆ యూనిట్ చాలా సంతోషంగా ఉంది.

CONFIRMED: Salman Khan To Remake Darshan's 'Sangolli Rayanna'

ఈ చిత్రంలో దర్శన్... లెజండరీ యోధుడు సంగోలి రాయన్న గా కనిపించారు. ఆయన కిట్టూరు సామ్రాజ్యపు సైన్యాధ్యుడు. ఈ చిత్రంలో ఆయన ఫిల్మ్ ఫేర్ బెస్ట్ అవార్డు, స్టేట్ అవార్డులు పొందారు. అప్పటినుంచి సల్మాన్ కు ఈ చిత్రంపై కన్ను ఉంది. అయితే ఇన్నాళ్లకు ఆ విషయమై క్లియర్ అయ్యింది.

సంగోలి రాయన్న చిత్రం రిలీజైనప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని సెంటర్లలోనూ 100 రోజులు ఆడింది. హిందీలోనూ ఈ చిత్రం భారీగా తెరకెక్కనుంది. సల్మాన్ ఖాన్ ...తమ నేటివిటికి తగినట్లు కొద్ది మార్పులు చేయనున్నారు. అలాగే..ఆయన లీడ్ రోల్ లో కనిపిస్తారు. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం ఖరారు కాలేదు.

English summary
Yet another pride moment for Kannada industry. After Mythri and Mr and Mrs Ramachari is being chosen to be remade in Telugu, now Darshan's Sangolli Rayanna will be remade in Hindi starring Salman Khan in the lead.
Please Wait while comments are loading...