»   » అయోమయంలో... ‘కృష్ణం వందే జగద్గురుమ్’

అయోమయంలో... ‘కృష్ణం వందే జగద్గురుమ్’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: హీరో దగ్గుబాటి రాణా నటిస్తున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం విడుదలపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డమరుకం చిత్రంతో పోటీ పడుతూ నవంబర్ 9న విడుదల చేస్తున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపించాయి. అయితే పలు కారణాలతో ఈ చిత్రం విడుదలపై నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  నిన్న సెన్సార్ కార్యక్రమాలు ముగిసే వరకు ఈ చిత్రాన్ని నవంబర్ 9నే విడుదల చేస్తారని అనుకున్నారంతా. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో విడుదల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు నిర్మాతలు. కొన్ని చర్చల తర్వాత నవంబర్ 16న లేదా, నవంబర్ 23న విడుదల చేయానే నిర్ణయానికి వచ్చారు.

  తన కొడుకు సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి సురేష్ బాబు ముందుకు రావడంలో సినిమా మొదట అనుకున్నట్లు నవంబర్ 9నే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అంతగా స్టార్ ఇమేజ్ లేని రాణా సినిమాను నాగార్జునతో పోటీ పడుతూ విడుదల చేసి నష్ట పోవడంకంటే వేచి చూడటమే సబబని ఇటు నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

  సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని...ఇందుకు కోసం సరైన తేదీ కోసం అన్వేషించ సాగారు. ఈ నెల 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈచిత్రానికి భారీగా థియేటర్లు దొరికే అవకాశం ఉండటంతో అదే రోజున సినిమాను విడుదల చేయాలని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయమై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది.

  హీరో దగ్గుబాటి రాణా, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. రాణా సరసన నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.

  English summary
  Confusion Continues on Rana Daggubati’s ‘Krishnam Vande Jagadgurum’ release date. The release date of film has been shifted back to November 30th. Just last night, the production team decided to get the film released on November 9th after discussions with distributors and financiers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more