twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డీజే’ పై బ్రాహ్మణుల మండిపాటు : ఈ పాట తో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని??

    తాజాగా ‘డీజే’ మూవీ నుండి వచ్చిన రెండో సాంగ్ ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ పాట ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడు వివాదం లో చిక్కుకుంది...

    |

    వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌'. రీసెంట్ గా రిలీజైన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాదించడంతో సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట 'శరణం భజే భజే' అనూహ్య స్పందనను దక్కించుకోగా తాజాగా 'డీజే' మూవీ నుండి రెండో సాంగ్ 'గుడిలో బడిలో మడిలో ఒడిలో' విడుదలైంది. ఈ పాట కూదా అభిమానులకు నచ్చేసింది... అయితే ఈ పాట ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడు వివాదం లో చిక్కుకుంది...

    బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయని

    బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయని

    ఈ సినిమాలో గుడిలో, మడిలో, బడిలో, ఒడిలో అంటూ సాగే పాటపై బ్రాహ్మణ సేవా సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పాటలోని కొన్ని పదాలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సహనం తో ఉండే బ్రాహ్మణులను మరీ ఇంత తక్కువగా, అవమానించే పద్దతిలో చూపటం మానుకోవాలని కూడా హెచ్చరించారు.

    తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి

    తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి

    రుషులను కించపరిచేలా ఉన్న పాటను వెంటనే నిలుపుదల చేయాలని సెన్సార్‌ బోర్డుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి చేసింది. లేదంటే తమను కించపరిచేలా ఉన్న దృశ్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సేవాసమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా మని సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

    అస్మైక యోగ తస్మైక భోగ

    అస్మైక యోగ తస్మైక భోగ

    ‘డీజే' సినిమాలోని సాహితి రాసిన ‘‘అస్మైక యోగ తస్మైక భోగ'' పాటలో.. ‘‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం'' అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ‘ప్రవర'లో ప్రణయ మంత్రాలు

    ‘ప్రవర'లో ప్రణయ మంత్రాలు

    రుద్ర శ్లోకంలోని పదాలను శృంగారపరమైన భావాన్ని వ్యక్తీకరించడం తప్పు అని వారు చెబుతున్నారు. అలాగే రుషిపరంపరను, గోత్రనామాలను తెలిపే ‘ప్రవర'లో ప్రణయ మంత్రాలుంటాయనడం అపచారమని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా ‘‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం'' అనే లైన్ తమను అవమానించడమేనని ఆరోపించారు.

    గీత రచయిత సాహితి వివరణ

    గీత రచయిత సాహితి వివరణ

    అయితే వీరి వాదన విన్న గీత రచయిత సాహితి వివరణ మరోలా ఉంది, హీరో బ్రాహ్మణ యువకుడని, తనకు తెలిసిన భాష, పదాలను వాడుతాడని, అక్కడ హీరో పాత్రకి సరిఒపోయే విధంగా రాసానే తప్ప తనకు వ్యతిగతంగా ఒక కులాన్నో, వర్గాన్నో కించపరిచే ఉద్దేశమే లేదంటూ చెప్పటమే కాక, అసలు ఆ పాటలో ఉన్న తప్పేంటో తనకు అర్థం కావడం లేదని అన్నాడు.

    English summary
    the second single from DJ "Duvvada Jagannadham" ‘Asmaika Yoga Tasmaika Boga’ landed the film into controversies. Some of the lyrics from the song have been objected by a section of Brahmins and a complaint has been registered with the Censor Board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X