»   » యాక్టర్లు, డైరెక్టర్లు... గొడవలు (ఫోటో ఫీచర్)

యాక్టర్లు, డైరెక్టర్లు... గొడవలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కాంట్రవర్సీలు, చిన్నచిన్న గొడవలు సినిమా పరిశ్రమలో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక బాలీవుడ్ లాంటి భారీ పరిశ్రమల్లో ఇలాంటివి సర్వ సాధారణం. ముఖ్యంగా డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ల మధ్య గొడవలు వస్తే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి. ఆ మధ్య సైఫ్ అలీ ఖాన్ దర్శకుడు సాజిద్ ఖాన్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. సాజిద్ ఖాన్ తో పని చేసి చాలా పెద్ద తప్పు చేసానని, మరోసారి అతని దర్శకత్వంలో చేయనని తేల్చిచెప్పాడు.

'హమ్ షకల్స్' అనే సినిమా విడుదల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని చెత్త సినిమాలకంటే చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు అతని భార్య కరీనా కూడా మద్దతు పలికింది. సినిమాపై అభిప్రాయం తెలిపే హక్కు ప్రతి ఒక్క యాక్టర్ కు ఉంటుందని స్పష్టం చేసింది.

సినిమా బాక్సాఫీసు వద్ద పెయిలైతే...నటీనటుల బాధ్యత కూడా ఉంటుంది. మొత్తం దర్శకుడిపైనే నెట్టేయడం సరికాదు అని మరికొందరు అంటుంటారు. ఇలా దర్శకుడికి, నటీనటులకు మధ్య విబేధాలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. స్లైడ్ షోలో అలాంటి కాంట్రవర్సీలకు సంబంధించిన వివరాలు.

కరీనా కపూర్-కరణ్ జోహార్

కరీనా కపూర్-కరణ్ జోహార్

హీరోయిన్ కరీనా కపూర్, దర్శకుడు కరణ్ జోహార్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే కరణ్ జోహార్ నిర్మించిన ‘కల్ నో న హో' అనే చిత్రం నుండి కరీనా కపూర్ తప్పుకుంది. ఈ చిత్రానికి కరీనా కపూర్ తన మార్కెట్ రేటు కంటే ఎక్కువ డిమాండ్ చేయడంతో అంత మొత్తం ఇవ్వడానికి కరణ్ జోహార్ ఇష్ట పడలేదు. దీంతో కరీనా స్థానంలో ప్రీతీ జింతాను తీసుకున్నారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు.

సల్మాన్ ఖాన్-అనీజ్ బజ్మీ

సల్మాన్ ఖాన్-అనీజ్ బజ్మీ

రెడీ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, ఆ చిత్ర దర్శకుడు అనీజ్ అజ్మీ మధ్య చిన్నపాటి గొడవజరిగింది. సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

అమీర్ ఖాన్-అమోల్ గుప్తా

అమీర్ ఖాన్-అమోల్ గుప్తా

‘తేరే జమీన్ పర్' చిత్రం విషయంలో అమీర్ ఖాన్, అమోల్ గుప్తా మధ్య విబేధాలు వచ్చాయి. సినిమా దర్శకత్వం చేయడం ఆపేయాలని, మిగిలినది తానే చేసుకుంటానని అమీర్ ఖాన్ అడిగారట. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయలేదు.

అజయ్ దేవగన్, అనుభవ్ సిన్హా

అజయ్ దేవగన్, అనుభవ్ సిన్హా

‘క్యాష్' సినిమా సమయంలో అజయ్ దేవగన్, దర్శకుడు అనుభవ్ సిన్హాపై కోపంగా ఉన్నారట. ఆ సమయంలో అనుభవ్ సిన్హా శిల్పా శెట్టితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అనుభవ్ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టిన సినిమాలో తీసుకోవాలని ట్రై చేసాడు. ఈ పరిణామాలు అజయ్ దేవగన్ కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కరీనా కపూర్-మాధుర్ బండార్కర్

కరీనా కపూర్-మాధుర్ బండార్కర్

‘హీరోయిన్' సినిమా సమయంలో స్క్రిప్టు మార్పు చేయడంతో మాధుర్ బండార్కర్, కరీనా కపూర్ మధ్య విబేధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.

English summary
Controversy is not new to the Hindi film Fraternity but this seems that the Bollywood is juggling between weather to say or not. Saif Ali Khan's statement on Sajid Khan has sparked a new controversy in the film fraternity. Sometime back, Saif Ali Khan said that working with director Sajid Khan was a big mistake and he will not work with the director again.
Please Wait while comments are loading...