»   » ఆంధ్రా మహిళలను కించపరిచేలా టైటిల్‌: ఆంధ్రా సెటిలర్స్ ఫోరం కేసు...

ఆంధ్రా మహిళలను కించపరిచేలా టైటిల్‌: ఆంధ్రా సెటిలర్స్ ఫోరం కేసు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ టైటిల్ తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం కోర్టును ఆశ్రయించింది. ఇది తమ ప్రాంతం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, మహిళలను అసభ్యంగా చూపే విధంగా టైటిల్ ఉందని, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ టైటిల్ మార్చాలని తమ పిటీషన్ లో కోరారు. ఈ కేసుపై ఈ రోజు విచారణ జరిగింది. తీర్పును గురువారానికి వాయిదా వేసారు.

సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆకాష్‌ పూరి, ఉల్కా గుప్తా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఆంధ్రాపోరి'. రమేష్‌ ప్రసాద్‌ నిర్మాత. రాజ్‌ మాదిరాజ్‌ దర్శకుడు. సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్‌ 'యు' సర్టిఫికేట్‌ను పొంది జూన్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా విడుదలవుతుంది.


ప్రతి మనిషి జీవితంలో తొలిప్రేమ ఉంటుంది. మనిషి చనిపోయే వరకు ఆ అనుభవాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకులను అలాంటి అందమైన అనుభూతికి గురిచేసే చిత్రమిది అంటూ దర్శకుడు సినిమా గురించి చెప్పుకొచ్చారు.


Controversy on 'Andhra Pori' title

ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ తదితరులు నటిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు, సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.

English summary
Controversy on 'Andhra Pori' title. Andhra Pori is the Telugu film that is releasing soon. The film is the official remake of Marathi super hit film Time Pass. Akash Puri and Ulka Guptha played the lead roles of the film.
Please Wait while comments are loading...