twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో భరత్ అనే నేను.. నోటీసులు పంపిస్తాం, ఆ పార్టీ మాదే!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మంచి విజయం సాధించింది. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ సీఎంగా మహేష్ నటన ఆకట్టుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్నపటికీ ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూడుకున్నాడు. ఇప్పటికీ భరత్ అనే నేను చిత్రం మంచి వసూళ్లతో రన్ అవుతోంది.

    Recommended Video

    Bharath Ane Nenu Reached 200 Crores Collections

    రాజకీయ పరమైన కథతో ఎలాంటి వివాద భరిత అంశాలకు తావు లేకుండా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రాఫిక్ సమస్య, ప్రభుత్వ విద్యావిధానం, లోకల్ గవర్నెన్స్ వంటి అంశాలని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. వివాదాలకు చోటు లేకుండా దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భరత్ అనే నేను చిత్రం చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది.

     ఆ పార్టీ మాదే

    ఆ పార్టీ మాదే

    భరత్ అనే నేను చిత్రంలో ఉపయోగించిన నవోదయం పార్టీ తమదే అని ఆ పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. ఇందులో ఉపయోగించిన గుర్తు కూడా తమదే అని దాసరి రాము అంటున్నారు.

     ఎలా వాడుకుంటారు

    ఎలా వాడుకుంటారు

    తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉందని, అలాంటి పార్టీని చిత్రాల్లో ఎలా వాడుకుంటారని దాసరి రాము అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు పంపబోతున్నట్లు ఆయన తెలిపారు.

    జాగ్రత్తలు తీసుకున్నా

    జాగ్రత్తలు తీసుకున్నా

    భరత్ అనే నేను చిత్రం విషయంలో ఎలాంటి వివాదాలకు జరగకుండా తాను చాలా అలోచించి కథ రూపొందించామని కొరటాల చిత్ర ప్రమోషన్ లో చెప్పారు. ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, నాయకుడిని కానీ టార్గెట్ చేసే విధంగా ఈ చిత్రంలో డైలాగులు,సన్నివేశాలు లేవు. కేవలం ప్రజలు ఆలోచించేలా మాత్రమే చిత్రాన్ని రూపొందించినట్లు కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే.

    శ్రీమంతుడు చిత్రం కూడా

    శ్రీమంతుడు చిత్రం కూడా

    శ్రీమంతుడు చిత్రం కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్ర కథ తనది అని ఓ రచయిత కోర్టులో పిటిషన్ వేయడంతో కొరటాల శివ, మహేష్ బాబు నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Controversy on Mahesh Babu Bharat Ane Nenu movie. They used our party name says Dasari Ramu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X